లినక్స్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
లినక్స్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
14, మే 2012, సోమవారం
లినక్స్ ఏవిధంగా నిర్మితమైంది...
లినక్స్ ఫౌండేషన్ రూపొందించిన ఈ లఘుచిత్రంలో లినక్స ఏ విధంగా అభివృద్ధిచేయబడిందో చూడవచ్చు.
లెబెల్స్:
లినక్సు,
లినక్స్,
లినక్స్ ఫౌండేషన్
31, జనవరి 2012, మంగళవారం
తెలుగు లినక్స్ బ్లాగుకు తిరిగి స్వాగతం...
కొన్ని కారణాల దృష్ట్యా గత కొద్ది కాలముగా ఎటువంటి టపాలను చేయలేకపోయాను. తెలుగు లినక్స్ స్థానీకరణ, వివిధ స్వేచ్ఛాయుత సాఫ్టువేర్ స్థానికీకరణపై పూర్తి శ్రద్ధ పెట్టడం వలన గత కొద్ది నెలలుగా బ్లాగును నవీకరించడం కుదరలేదు. ఉన్నటువంటి అనువాదాలన్నిటినీ సమీక్షించి సామాన్య వాడుకరికి అర్ధమయ్యే రీతిలో ఉండాలని భావించి ఈ కార్యానికి పూనుకోవడం జరిగింది. నా మాతృ భాషకు నేను ఏదో ఒకటి చెయ్యాలనే సంకల్పమే నన్ను ఆ దిశగా నడిపించింది. నేను అనుకున్న లక్ష్యాలు దాదాపు చేరుకున్నాను వాటిలో ముఖ్యమైనవి వియల్సీ మాధ్యమ ప్రదర్శకం (VLC మీడియా ప్లేయర్), జిపార్టెడ్, షాట్వెల్, బన్షీ, ఉబుంటు అంతర్భాగ అనువర్తనాలు, లినక్స్ మింట్, గింప్, గ్నోమ్ అనువర్తనాల అనువాదం మరియు సమీక్ష, వెబ్సైటు తెలుగీకరణ, ఫెడోరా వెబ్సైటు తెలుగీకరణ, Xfce, LXDE అంతరవర్తుల అనువాదం...ఇంకా చాలా చేసాననుకోండి (చెబితే అదో పెద్ద జాబితా అవుతుంది :-)). చిన్న పిల్లల కోసం ఏదైనా ఒక లినక్స్ పంపిణీను తెలుగులోకి తీసుకురావాలనుకున్నాను. అందుకని డ్యుడ్యులినక్స్ అనే పరియోజనలో భాగస్వామినై అనువదించాను. ఇది దాదాపు 43 శాతం పూర్తయినది. కాకపోతే అంతర్జాలంలో అనువదించడం వలన కొన్ని అక్షరాలు ఎగిరిపోయినవి. అందువలన దీనిని ఇప్పటివరకూ ఎవరికీ సిఫారసు చేయలేకపోయాను. ఈ అనువాద దోషాలన్నీ ఇప్పటికే సరిచేసాను ఇక కొత్త రూపాంతరం వెలువడం ఒక్కటే ఆలస్యం.
ఇకనుండి సరికొత్త లినక్స్ సాంకేతికాలను, మెలుకువలను, చిట్కాలను మరియు జిమ్మిక్కులను వివిధ రూపాలలో అందించే ప్రయత్నం చేస్తాను.
మీరు తెలుగులినక్సును ఫేస్‌బుక్, యూట్యూబ్ లలో కూడా అనుసరించవచ్చు.
ఎప్పటివలె మీ సలహాలను, సూచనలను తెలుగులినక్సుకు అందిస్తారని ఆశిస్తున్నాను.
నిర్వాహకుడు,
Praveen Illa.
ఇకనుండి సరికొత్త లినక్స్ సాంకేతికాలను, మెలుకువలను, చిట్కాలను మరియు జిమ్మిక్కులను వివిధ రూపాలలో అందించే ప్రయత్నం చేస్తాను.
మీరు తెలుగులినక్సును ఫేస్‌బుక్, యూట్యూబ్ లలో కూడా అనుసరించవచ్చు.
ఎప్పటివలె మీ సలహాలను, సూచనలను తెలుగులినక్సుకు అందిస్తారని ఆశిస్తున్నాను.
నిర్వాహకుడు,
Praveen Illa.
8, ఏప్రిల్ 2011, శుక్రవారం
లినక్స్ కథ...
లినక్స్ 20వ వార్షికోత్సవం జరుపుకుంటుంది. లినక్స్ గురించి ఇప్పటివరకూ తెలియని వారు, తెలుసుకోవాలనుకుంటున్నవారు ఒకసారి లినక్స్ కథను చూడండి. ఈ వీడియోలో లినక్స్ చరిత్రను మరియు దీని వెనుక ఉన్న ముఖ్య వ్యక్తుల కృషి గురించి తెలుసుకుంటారు. ఈ సందర్భంగా లినక్స్ ఫౌండేషన్ ఒక వీడియో పోటీని కూడా నిర్వహిస్తుంది.
4, మార్చి 2011, శుక్రవారం
లినక్స్ != విండోస్ (లినక్స్ విండోస్ కు సమానం కాదు)
!= 
(లినక్స్ నాట్ ఈక్వల్ టూ విండోస్)
లినక్స్ కు కొత్తగా పరిచయమైన వ్యక్తులు, కొత్త వాడుకర్లకు ప్రతి విషయంలో విండోస్ ని పోల్చుకుంటూ లినక్స్ ను వాడే అలవాటు ఉంటుంది. కానీ ఇవి రెండు అస్సలు పొంతన లేనివి. ఒక్క విషయం - రెండూ నిర్వహణా వ్యవస్థలని తప్ప = మిగతా ఏ విషయాల్లోను రెండూ ఒక పక్షం కావు.
(సశేషం)
14, ఫిబ్రవరి 2011, సోమవారం
లినక్స్ ఎందుకు?
ఈ టపా ఇంతక ముందు రాసిన లినక్స్ అంటే ఏమిటి? అన్న టపా కు తరువాయి భాగం.
లినక్స్ కొన్ని అద్వితీయమైన ఉత్తమమైన సాఫ్ట్వేర్లకు నెలవు. అంతకంటే ఉత్తమమైన విషయం ఇవి ఉచితంగా లభించడం. చట్టరీత్యా విండోస్ లేక అడోబ్ వారిచ్చే వీడియో లేక ఆడియో ప్లేయర్లకు వారు మనవద్ద రుసుము తీసుకొనవచ్చు, అలా కాకపోతే అది అనైతికం అవుతుంది. కానీ లినక్స్ తో ఆ చిక్కులు లేవు.
లినక్స్ తోవచ్చే కొన్ని ప్రముఖమైన సాఫ్ట్వేర్లు:
లినక్స్ లోని అన్ని ప్రకల్పాలు(ప్రాజెక్టులు) దాదాపు ఇదే విధంగా పని చేస్తాయి.
లినక్స్ అవగాహనలో ఇది రెండవ మజిలీ.
మీకిప్పుడు లినక్స్ అంటే ఏమిటో తెలిసింది.
కానీ అది మీరు విండోస్ లేక మ్యాక్ ను వదిలి లినక్స్ వాడుకర్లు కావటానికి దోహదం చేయదు.
లినక్స్ యునిక్స్ కన్నా ఎన్నోరెట్లు ప్రత్యేకమైనది. అదెలా?
ఇందుకు గల ముఖ్య కారణం లినక్స్ కు ఉన్న లైసెంస్ -- "ఓపెన్ సోర్స్"
లినక్స్ ఒక సంపూర్ణ ఓపెన్ సోర్స్ నిర్వహణా వ్యవస్థ, అదెలా?
ఇలా:
- లినక్స్ వాడే గ్నూ జెనరల్ పబ్లిక్ లైసెన్స్ ప్రకారం, మీరు లినక్స్ ను ఉచితంగా పొందవచ్చు, దాని మూలపదాల్ని కూడా పొంది, మార్పులు చేసి మరలా అందరికీ అందుబాటులో ఉంచవచ్చు. మరియు ఇలా తిరిగి పంచేప్పుడు కావాలంటే ఒక ధర నిర్ణయించి ఆ ధరకు అమ్మవచ్చుకూడా!
- లినక్స్ మూల పదాలు(సోర్స్ కోడ్) అందుబాటులో ఉండటం వలన అలా రూపొందే సాఫ్ట్వేర్ లో సాధారణం కంటే తక్కువ లోపాలు(బగ్స్) ఉంటాయి, మరియు అవి కూడా వెంటనే నివృత్తి చేయబడి, లోపరహితంగా ఉండే లినక్స్ అందుబాటులో ఉంటుంది.
- ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అంటే అది ఎటువంటి ప్లాట్ఫాం అయినా పనిచేస్తోంది. వహనీయత చాలా విస్తృతం.
- నమ్మదగిన సాఫ్ట్వేర్ ఎందుకంటే మూలపదాలు మనవద్ద ఉండటంవలన మన దస్త్రాలు లేక మన సమాచారం ఏ-ఏ మార్పులకు లోనవుతుందో మనకు తెలుసు, అందువల్ల సమాచారచౌర్యం(data stealing, eavesdropping) వంటి సమస్యలు ఉండవు.
- ఏదో ఒకరోజు ఫలానా సాఫ్ట్వేర్ కంపెనీ జెండా ఎత్తేస్తే ఆ సాఫ్ట్వేర్ అందుబాటులో ఉండదు అన్న సమస్య నెట్ స్కేప్ వాడుకర్లకు నెట్స్కేప్ బ్రౌజరు నిలిపివేత తరువాత ఎదురైంది. అలా ఏనాటికీ లినక్స్ మూసివేత ఉండదు.
- ఇది ఉచితం! మరియు ఎటువంటి సాంకేతిక సహాయం కావాలన్నా మేమున్నాం! :)
అంటే, మీకు డబ్బూ ఖర్చు ఉండదు, మంచి నాణ్యతగల సాఫ్ట్వేర్ కూడా మీ స్వంతం!
మరి వాణిజ్యం? సాధారణంగా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ వ్యవస్థకు ఆదాయం సాంకేతిక సహాయం, పంపకాలు మరియు శిక్షణ ద్వారా వస్తాయి. ఇది ఒక వినూత్నమైన వ్యాపార సూత్రం, దీనిని ఇప్పటికే వాణిజ్యరంగంలో మహామహులైన ఐబీఎమ్, హెచ్ పీ, నోవెల్, సన్ , ఇన్టెల్ ఆచరణలో పెట్టారు. ఐటీకాని కంపెనీలు, ఉదాహరణకు బోయింగ్, గ్లాక్సోస్మి త్క్లైన్ , మొదలగునవి కూడా ఈ సూత్రాన్నే వాడుతూ ఓపెన్ సోర్స్ కు తమ వంతు తోడ్పాటు చేస్తున్నారు.
ఎంతటి క్లిష్టమైన పనినైనా చెయ్యటానికి లినక్స్ ఒక నమ్మదగిన వేదిక:
- విండోస్ వంటి వాటితో పోలిస్తే అనవసరపు ప్రోగ్రాంలతో లినక్స్ సమర్థవంతంగా పని చెయ్యటం వల్ల మీ సిస్టం క్రాష్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. మీ దస్త్రాలకు భద్రత.
- లినక్స్ లో ప్రస్తుతం వైరస్లు లేవు. లినక్స్ వంటి నిర్దిష్టమైన వ్యవస్థలో ప్రస్తుత వైరస్ లు చొరబడలేవు, పూర్తి వైరస్ తీరుతెన్నులు మారితే గానీ ఆ అవకాశం లేదు, అది ఇప్పట్లో సాధ్యం కాదు.
- ఇది పాత, మూలపడిన మీ హార్డ్వేర్ పై కూడా నడుపవచ్చు.
- యాంటివైరస్లకు ఇక స్వస్తి పలుకండి.
- సెక్యూరిటీ(భద్రత) అనేది ఇక్కడ ఒక భాగం, అదనపు విశేషం కాదు.
లినక్స్ కొన్ని అద్వితీయమైన ఉత్తమమైన సాఫ్ట్వేర్లకు నెలవు. అంతకంటే ఉత్తమమైన విషయం ఇవి ఉచితంగా లభించడం. చట్టరీత్యా విండోస్ లేక అడోబ్ వారిచ్చే వీడియో లేక ఆడియో ప్లేయర్లకు వారు మనవద్ద రుసుము తీసుకొనవచ్చు, అలా కాకపోతే అది అనైతికం అవుతుంది. కానీ లినక్స్ తో ఆ చిక్కులు లేవు.
లినక్స్ తోవచ్చే కొన్ని ప్రముఖమైన సాఫ్ట్వేర్లు:



గింప్ : ఫోటోషాప్ కు ధీటుగా అందుబాటులో ఉన్న ఫోటో కూర్పు సాఫ్ట్వేరు

ప్రముఖ మీడియా ప్లేయర్.

...ఇలా ఎన్నో ఎన్నెన్నో...
మరి అంతా ఉచితమయితే, నాకేమిటంటా?
మీరే కాదు చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడే పొరబడుతుంటాయి. చాలా వరకు లినక్స్ అంటే ఒక వ్యాపకం, అది కాలేజీ కుర్రాళ్ళకుండే ఒక చెడు వ్యసనం అని ఫీలయ్యేవాళ్ళు నేటికీ ఉన్నారూ( మా హెచ్ ఓడీ తోసహా)
అయితే ఇవన్నీ కేవలం అపోహలు. నిజాలు:
- ఎలా అయితే కార్పొరేట్ సాఫ్ట్వేర్లను పెద్ద కంపెనీలు కొని వాడుకుంటాయో అలానే లినక్స్ ను కూడా కొని వాడుతారు.
- ఇన్టెల్ వంటి బహుళజాతి సంస్థలు లినక్స్ లో భారీగా పెట్టుబడులు పెట్టి తద్ఫలితంగా వారు తయారుచేసిన హార్డ్వేర్ కు వెనువెంటనే పని చేయించే సాఫ్ట్వేర్ కేవలం లినక్స్ మాత్రమే ఇవ్వగలదు. విండోస్ వంటి సాఫ్ట్వేర్లు కొత్తగా వచ్చిన హార్డ్వేర్కు సరిపోవు.
- చైనా వంటి దేశాల్లో ౭౦% వరకూ అన్ని కంప్యూటర్లలోనూ లినక్స్ ను మాత్రమే వాడుతున్నారు.ఈ విధంగా ఆ దేశ పౌరులకు చాలా వరకు ధనం ఆదా అవుతుంది. తద్వారా కంప్యూటర్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.
- మరెన్నో కంపెనీలు వారి సర్వర్లను లినక్స్ కు మార్చుకుంటున్నారు, కారణం : రక్షణ మరియు భద్రత.
- అలానే ఈ విధంగా లినక్స్ ద్వారా, లేక ఇతర స్వేచ్ఛా సాఫ్ట్వేర్ల ద్వారా లాభం పొందిన వ్యక్తులు, విద్యార్థులు, సంస్థలు, విశ్వవిద్యాలయాలు, వారి వారి తోడ్పాటులను లినక్స్ కు తిరిగి అందించటం ద్వారా లినక్స్ మరింత ప్రభావవంతం అవుతున్నది. దీనికి మంచి ఉదాహరణ : వికీపీడియా. వికీపీడియా ఎటువంటి ఖర్చులేకుండా పూర్తి ఉచితంగా మీకు సమాచారాన్ని అందిస్తుంది, అందువల్లనే కోట్లాది మంది మరలా తిరిగి వికీపీడియాకు సమాచారాన్ని చేర్చి మరింత సమృద్ధి పరుస్తున్నారు.
లినక్స్ లోని అన్ని ప్రకల్పాలు(ప్రాజెక్టులు) దాదాపు ఇదే విధంగా పని చేస్తాయి.
లెబెల్స్:
అవగాహన,
గ్నూ/లినక్స్,
తెలుగు లినక్స్,
లినక్స్
7, ఫిబ్రవరి 2011, సోమవారం
డెబియన్ -ది యూనివర్సల్ ఆపరేటింగ్ సిస్టం
డెబియన్ 1993లో ఇయాన్ ముర్డాక్ అనే పుర్డ్యు విశ్వవిద్యాలయ విద్యార్ధిచే సృష్టించబడింది.అతను లినక్స్ పంపకం అందరికీ అందుబాటులో డెబియన్ ప్రణాళిక ఉండేటట్లు రూపొందించాడు.డెబియన్ కు ఆ పేరు ఎలా వచ్చిందంటే అతని స్నేహితురాలి(ఇపుడు అతని భార్య ) పేరు డెబ్రా(DEBRA) లోని మొదటి మూడు అక్షరాలను తన పేరులోని(Ian Murdock) మొదటి మూడు అక్షరాలను కలిపి DEBIAN గా తయారయింది.దీనిని డెబియన్(deb-e′-en)అని పిలుస్తారు.
డెబియన్ అంటే చాలా మందికి తెలియదు మనవాల్లకి ఉబుంటునో లేదా లినక్స్ మింట్ వంటి వాటి గురించి తెలుసేమోగాని దీని గురించి మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు.అసలు వీటన్నిటికీ మూలమే డెబియన్.ఇది లినక్స్ కెర్నల్ను మరియు గ్నూ ఆపరేటింగ్ సిస్టం సాధనాలను వాడి చేయబడింది కనుక డెబియన్ గ్నూ/లినక్స్ గా కూడా పిలుస్తారుదీనిని డెస్క్టాపు మరియు సెర్వర్(సేవిక)గాను వాడుకోవచ్చు.డెబియన్ లినక్స్ యునిక్స్ మరియు ఉచిత సాప్ట్వేర్ సంబందిత తత్వాలను ఖచ్చితంగా అనుసరిస్తుంది.డెబియన్ అభివృద్దిచేసేవారు స్థిరమైన,దృఢమైన రక్షణతో తయారుచేయటానికే వారి దృష్టినికేంద్రీకరిస్తారు.ఇలా రూపొందించిన దానినే చాలా ఇతర లినక్స్ పంపకాలు ఆధారంగా వాడుకుంటాయి, వాటిలో ఉబుంటు,లినక్స్ మింట్ నాపిక్స్, గ్సాండ్రోస్లు ఇతర ఉన్నాయి.
అందరికీ అందుబాటులో ఉండే ఒక ఫ్రీ ఆపరేటింగ్ సిస్టం అభివృద్ధిపరచాలనేదే డెబియన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వేలాది స్వచ్ఛంద కార్యకర్తలచే మరియు లాభం ఆశించని స్వచ్ఛంద సంస్థల విరాలాలచే అభివృద్ధి చేయబడుతుంది.
డెబియన్ విరివిగా పొందగలిగిన సాప్ట్వేర్లకు,ఐచ్ఛికాలకు కొలువు.ప్రస్థుత స్థిర విడుదల 25 వేల సాప్ట్వేర్ ప్యాకేజీలను 12 వివిధ రకాల కంప్యూటర్ నిర్మితాలకు అందిస్తుంది.ఈ నిర్మితాలలో ఇంటెల్/AMD 32-బిట్/64-బిట్ నిర్మితాలు వ్యక్తిగత కంప్యూటర్లలో వాడబడుతుంటే, ARM నిర్మితాలలో ముఖ్యంగా ఎంబెడెడ్ సిస్టంలలో మరియు IBM సెర్వర్ మెయిన్ ఫ్రేమ్ లలో సాధారణంగావాడుతూ కనిపిస్తున్నాయి.డెబియన్ లో చెప్పుకోదగ్గ ముఖ్య మైనది APT ప్యాకేజీ మేనేజ్ మెంట్ సిస్టం, అధిక మొత్తంలో ప్యాకేజీలు, నిర్ణబద్దమైన ప్యాకేజీల విధానాలు, అధిక నాణ్యత కలిగిన విడుదలలు.ఈ పద్ధతి ద్వారా పాత ప్యాకేజీల నుండి కొత్తగా విడుదల అయిన ప్యాకేజీలను కావలిసిన వాటిని స్వయంచాలకంగా స్థాపించి అనవసరమైన ప్యాకేజీలను తొలగిస్తుంది.డెబియన్ మరియు దాని ఆధారిత సాప్ట్వేర్లన్నీ .deb అనే పొడిగింతతో ఉంటాయి,వీటిని డెబియన్ ప్యాకేజీలుగా పిలుస్తారు.వీటిని సులభంగా స్థాపించి వాడుకోవచ్చు.
డెబియన్ ప్రమాణిక స్థాపనలో GNOME డెస్క్టాప్ పర్యావరణం వాడబడుతుంది.ఇందులో లిబ్రేఆఫీసు,ఐస్ వీసెల్(ఫైర్ఫాక్స్ నకలీ), ఎవల్యుషన్ మెయిల్, CD/DVD వ్రైటింగ్ ప్రోగ్రాంలు, సంగీత మరియు వీడియో ప్లేయర్లు, చిత్రాల వీక్షక మరయు సవరణ సాప్ట్వేర్లు, మరియు PDF చదువరి సాప్ట్వేర్లు డెబియన్ స్థాపించినపుడే దానితో పాటే స్థాపించబడతాయి.ముందుగా తయారుచేయబడిన CD ఇమేజ్లు KDE సాప్ట్వేర్ల కంపైలేషన్, Xfce మరియు LXDE వంటి డెస్క్టాపు పర్యావరణాలకు కూడా అందుబాటులో ఉన్నాయి.
డెబియన్ ను డౌన్లోడు చేసుకోవాలంటే అక్కడ మనకు చాలా ఇమేజ్ ఫైళ్ళు కనిపిస్తాయి.DVD ఫైళ్ళు అయితే ఐదు లేదా CD ఫైళ్ళు ఐతే ముప్పయి వరకూ ఉంటాయి.వీటిని చూసి చాలా మంది డౌన్లోడు చేసుకోవడానికి కూడా సాహసించరు నిజానికి అందులో ఉన్న మొదటి ఒక్క డిస్కు సరిపోతుంది పూర్తి ప్రామాణిక స్థాపన కోసం.మిగిలిన డిస్కులలో సిస్టం స్థాపనకు అవసరం లేని అధిక సాప్ట్వేర్లను ఉంచుతారు.మీరు ఒకసారి మొదటి డిస్కు పెట్టి డెబియన్ స్థాపించన తరువాత మీరు నేరుగా అంతర్జాల సదుపాయం మీకు ఉంటే మిగిలిన మీకు కావలసిన సాప్ట్వేర్లను నేరుగా డౌన్లోడు చేసుకుని స్థాపించుకోవచ్చు.అలాకాకుండా మీకు నెట్ సదుపాయం లేకపోతే మిగిలిన డిస్కులను మీరు కలిగిఉంటే ఆ డిస్కులను పెట్టి నేరుగా వాటినుండి సాప్ట్వేర్లను స్థాపించుకోవచ్చు.వాటిని(మిగిలిన డిస్కులను) అందించటంలో ముఖ్య ఉద్ధేశ్యం అంతర్జాల సదుపాయం లేకుండా సాప్ట్వేర్లు స్థాపించుకునే వీలు కల్పించడమే.ఈ సిడి/డివిడి ఇమేజ్ (.iso)ఫైళ్ళను మీరు ఉచితంగా నేరుగా లేదా టోరెంట్లు లేదా jigdoల ద్వారా వివిధ పద్ధతులలో డౌన్లోడు చేసుకోవచ్చు లేదా ఆన్ లైన్ వర్తకుల నుండి కొనుక్కోవచ్చు.
మన దేశంలో వాడుకోలోనున్న సి-డాక్(C-DAC) వారి బాస్(భారతీయ ఆపరేటింగ్ సిస్టం సొల్యూషన్స్) మరియు స్వేచ్ఛ వంటివి కూడా డెబియన్ ఆధారితాలే...
లెబెల్స్:
అవగాహన,
గ్నూ/లినక్స్,
డెబియన్,
లినక్స్,
telugu linux,
telugulinux
4, ఫిబ్రవరి 2011, శుక్రవారం
అసలు లినక్సు అంటే ఏమిటి?
ఈ ప్రశ్నకు జవాబు ఎన్ని సార్లు విన్నా భిన్నమైన జవాబులు వింటున్నా అన్న ఒక తోటి బ్లాగరు సలహా పై ఈ టపా రాస్తున్నా!
Linux, By Definition:


మ్యాక్ఓఎస్ యొక్క ఒకప్పటి రూపం
Linux, By Definition:
Linux is an open source UNIX-like operating system
which is popular for it's robustness and availability.
అనగా లినక్సు అనేది తన పనితనానికి ప్రసిద్ధియైన ఒక స్వేచ్ఛావాహక యునిక్సు-వంటి నిర్వహణా వ్యవస్థ.
కానీ నిజానికి లినక్స్ అనేది ఒక నుంగు(కెర్నల్) మాత్రమే. నుంగు నిర్వహణా వ్యవస్థ యొక్క మూలభాగం అత్యంత సున్నితమైన కార్యక్రమాలకు నుంగును ఉపయోగిస్తాము. ఈ నుంగు కథ, నిర్వహణా వ్యవస్థ తీరుతెన్నులు తెలుసుకుందాము. లినక్సు నుంగును వాడుకుంటూ వేలల్లో నిర్వహణా వ్యవస్థలు కలవు, వీటన్నిటినీ కలిపి లినక్సు అని మనం వ్యవహరిస్తుంటాం.
మీరు గమనించి ఉంటే కలనయంత్రాన్ని కొన్న వెంటనే దానిని ప్రారంభిస్తే నల్లని తెర కనిపించి, చిన్న శబ్దం చేసి అలానే ఉండిపోతుంది! కారణం అందులో నిర్వహణావ్యవస్థ లేదు. నిర్వహణావ్యవస్థ లేనిదే ఎంత బలమైన అంతర్జాలవ్యవస్థతో అనుసంధానం చేసినా, మీరు జాలంలోని గూడులను చూడలేరు, సంగీతం వినలేరు, సినిమాలు చూడలేరు, మీ దస్త్రాలను రాయలేరు.
అదీ మన నిర్వహణావ్యవస్థ ప్రాధాన్యత.
ఒక నిర్వహణావ్యవస్థ మీకూ, మీ కంప్యూటర్ నందు గల స్థూల ఉపకరణాలకు మధ్య నిలుస్తుంది.
మీరు మౌసును ఒక ఫోల్డర్ పై క్లిక్ చేసినపుడు, మీ నిర్వహణా వ్యవస్థ ఆ క్లిక్ కు సంబంధించిన చర్యను వెనువెంటనే రెప్పపాటుకంటే తక్కువ సమయంలో పూర్తిచేస్తుంది. ఇందుకోసం ముందు గానే నిర్వహణావ్యవస్థకు ఏ చర్యకు ఏ ప్రతిచర్య జరగాలి అన్న విషయాన్ని కార్యక్రమాల ద్వారా తెలపాలి. ఒక సీడీనుండి సినిమా చూపటం, కీబోర్డ్ పై గల బటన్స్ ను వత్తినపుడు ఆయా బటన్ కు సంబంధించిన అక్షరాలు/చర్యలు స్క్రీన్ పై చూపబడటం ఇవన్నీ ముందుగా నిర్వహణా వ్యవస్థకు ఆజ్ఞలతో కూడిన కార్యక్రమాల ద్వారా తెలుపుతాము.
సరే నిర్వహణా వ్యవస్థ ముఖ్యమైనదని తెలుసుకున్నాం. కానీ నిర్వహణా వ్యవస్థ ఏమేమి చేస్తుంది : ముఖ్యమైన పని - మన దస్త్రాలను దస్త్రవ్యవస్థను నిర్వహించటం.
నిర్వహణా వ్యవస్థ దస్త్రములతో ఇవన్నీ చెయ్యగలదు:
- దస్త్రాలను సృష్టించడం
- ఒకచోటనుండి మరో చోటుకి మార్చడం
- వాటి పేరు మార్పిడి
- ప్రతిరూపం తీయటం
- తీసివేయటం
- ప్రింటరుకు లేదా జాలానికి పంపడం
- ఇంకా చాలా చాలా...
ఇదీ నిర్వహణా వ్యవస్థ కథ!
ఇక యూనిక్సు గురించి తెలుసుకుందాము.
యునిక్సు 1969 లో బెల్ ల్యాబ్స్ , ఏటీ&టీ నందు మొదటిసారి రూపొందింది. ఇది మొట్టమొదటి నిర్వహణా వ్యవస్థ కాకపోయిన ఒక నిర్దిష్టతతో ఒకే కెర్నల్(నుంగు) తో తయారుచెయ్యబడ్డ పూర్తిస్థాయి నిర్వహణా వ్యవస్థ. అందుచేతనే అప్పట్నుండీ, నేటికీ అది ప్రముఖ నిర్వహణా వ్యవస్థగా కొనసాగుతున్నది. ఇది మైక్రోసాఫ్ట్ ఇంకా ఆపిల్ ఓఎస్ కన్నా ప్రసిద్ధమైనది.
యునిక్సు గురించి మరోసారి చూద్దాం.
ఇక లినక్సు
లినక్సు యునిక్సు లాంటి నిర్వహణా వ్యవస్థ, తీరుతెన్నుల్లో అచ్చుగుద్దినట్టు యునిక్సులా పనిచేసే లినక్సుకు యునిక్సుకి గల ఒకేఒక తేడా -- ఆ తేడానే లినక్సు ఇంత ప్రముఖంగా ఎదగటానికి కారణం. అదే లినక్సు ఉచితంగా అందుబాటులో ఉండటం. యునిక్సు ఎంత ప్రసిద్ధమైనా, నేటికీ ఎంతో మంది వాడుతున్నా, అది నిఃశుల్కం కాదు.
యునిక్సు నిర్వహణా వ్యవస్థలోని కొన్ని ప్రముఖ రకాలుః
ఫ్రీబీఎస్డీ తప్ప మిగతా ఏ యునిక్సు వాడాలన్నా మన జేబులు ఘల్లు ఘల్లుమంటూ ఉండాల్సిందే. వాటి ఖరీదు ఊహాతీతం. అందుకనే వీటిని నేడు కేవలం ధనిక బహుళజాతి సంస్థలు, విశ్వవిద్యాలయాలు మాత్రమే ఉపయోగిస్తున్నాయి.
కానీ గత కొద్ది కాలంగా చాలా సంస్థల్లో యునిక్సు స్థానం లినక్సు ఆక్రమిస్తోంది, ఒక్క ఉచితంగా దొరకడమే దీనికి కారణమనుకుంటే పొరపాటే.
యునిక్సు ఎందుకని అంత ప్రసిద్ధిచెందినది అంటే, దానికి కారణం యునిక్సుని ఒకేసమయంలో ఎందరైనా ఉపయోగించవచ్చు, అలానే ఒకే వ్యవస్థలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అంచేత యునిక్సు ఒక తెలివైన నిర్వహణా వ్యవస్థ కూడా!
మరి ఇలాంటి యునిక్సుని మనం ఎందుకు విరివిగావాడం.

1981 లో సియాటిల్ లో మైక్రోసాఫ్ట్ అనే ఒక చిన్న కంపెనీ(ప్రమాదవశాత్తు డిజిటల్ రిసర్చ్ అన్న కంపెనీ నిజానికి విడుదల చెయ్యాల్సిన) నిర్వహణా వ్యవస్థను విడుదల చేసింది. ఇది మళ్ళీ ప్రమాదవశాత్తు ఐబీఎమ్ వారి కొత్తగాప్రవేశ పెట్తిన ఐబీఎమ్ పీసీ తో కలిపి విడుదల చేయబడింది, ఈ పీసీ నేటి పీసీల్లా కాదు కేవలం కన్సోల్ లో (గ్రాఫికల్ కాక) ఉండేది, కాకపోతే ఇక్కడి ఆజ్ఞలు కొంచెం సుళువు. కానీ మైక్రోసాఫ్ట్ వాడి డాస్ అనబడే ఈ వ్యవస్థను ఒకసారి ఒకరే వాడవచ్చు, అంటే ఇది పనితనంలో యునిక్సంత కాదనమాట. కేవలం సుళువుగా ఉండటం అన్న కారణం తో ఇది విశ్వవ్యాపి అయింది. యునిక్సు కష్టతరం, ఖర్చుఎక్కువ అవటంతో అలానే లైసెన్సుల గొడవలతో యునిక్సు వాడుక మందగించి, డాస్ వాడుక పెరిగింది.

80వ దశకంలో, ఆపిల్ అనేసంస్థ పీసీకు ధీటుగా ఒక కలనయంత్రాన్ని ప్రవేశపెట్టింది. ఈ యంత్రం తన సొంత నిర్వహణా వ్యవస్థ తో కలదు. డాస్ వాడలేదు, మ్యాక్ఓఎస్ అనే నిర్వహణావ్యవస్థను ఇందులో వాడారు. ఆపిల్ కామాండులతో నడిచే డాస్, ఇన్కా యునిక్సుకు విరుద్ధంగా పూర్తిగా దృశ్యరూపంలో (గ్రాఫికల్) వ్యవస్థను ప్రవేశపెట్టి కీబోర్డ్ కు అదనంగా మౌసును జతచేసి ప్రవేశపెట్టారు. ఈ మౌసును చాలా అరుదుగా డాస్ లో వాడారు, ఇక్కడ అది విరివిగా వాడబడింది.
ఇదే సమయంలో యునిక్సు కు కూడా ఎక్స్ విండో సిస్టం అనబడే ఎక్స్ ఫ్రంట్ ఎండ్ తీర్చిదిద్దబడింది.

మ్యాక్ఓఎస్ యొక్క ఒకప్పటి రూపం
1990 లో మైక్రోసాఫ్ట్ విండోస్ ౩.0 (1 మరియు రెండు అంతగా ప్రాముఖ్యత పొందలేదు) అనే ఒకేవాడుకరికి సరిపోయే, ఒకసారికి ఒకే కార్యక్రమాన్ని చెయ్యగలిగే 16-బిట్ GUI తో రూపొందించబడింది.
యునిక్సు అప్పటికే 32-బిట్ మరియు 64-బిట్ సామర్థ్యం గల వ్యవస్థలపై పనిచెయ్యగల సామర్థ్యం కలిగిఉన్నా, ఖరీదు ఎక్కువగా ఉండేది. విండోస్ 95 అన్న 32-బిట్ వ్యవస్థ తో బహువాడుకరి, బహుకార్యకారిగా విడుదలై ప్రసిద్ధిచెందింది. అయినా యునిక్సు వాడుకలోనే ఉంది, యునిక్సుకిగల సామర్థ్యం వల్ల.
మరి యునిక్సుకీ లినక్సుకీ తేడా?
1991 నుంది 1995 మధ్యకాలంలో ఎందరో కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్యార్థులు యునిక్సు మరియు ఎక్స్ యొక్క వాడుకలో ఎన్నో సంచలనాలను సృష్టించసాగారు. ఈ-మెయిల్ అంతర్జాలం ఈ వ్యవధిలో రూపొందినవే.
ఈ కోవలో నే లినస్ టోర్వాల్డ్స్, 1991 లో ఫిన్ల్యాండ్ లోని హెల్సింకీ విశ్వవిద్యాలయంలో చదువుకునే వాడు.
లినస్ తరచు యునిక్సు వాడే వాడు. అతనికి డాస్ ఆధారిత 386పీసీ వాడటం విసుగునిచ్చేది. అందుచేత అతను తన సొంత నుంగును తయారుచెయ్యాలని నిర్ణయించాడు. నుంగు అనేది నిర్వహణా వ్యవస్థకు గుండె వంటిది, అది నేరుగా స్థూల ఉపకరణాలతో సంభాషిస్తుంది.
అతను ఈ నుంగును ఉచితంగా పంచాలని నిర్ణయించాడు, తద్వారా ఎక్కువమంది వాడి వారి అనుభవాలు తెలుపుతారని! 1991 సంవత్సరపు ఆఖరుకల్లా అతను లినక్సు నుంగును పూర్తిచేసాడు. 32-బిట్ సామర్థ్యంగల నుంగుని చెయ్యటమే కాక అది అచ్చం యునిక్సులా ఉండేలా చేసాడు. కానీ ఈ నుంగుపై నడుపుటకు తన వద్ద సాప్ట్వేర్లు లేవు.
అదృష్టవశాత్తు అమెరికాలోని ఒక పూర్వ విద్యార్థి రిచార్డ్ స్టాల్మాన్ కోమలాంత్రకోవిదుల గుంపును సమీకరించి ఉచితంగా మృదోపకరణలను సృష్టించడం మొదలెట్టారు. ఫ్రీసాఫ్టువేర్ ఫౌండేషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి గ్ను ను కనుగొన్నారు. అలా గ్ను ద్వారా వచ్చిన మృదోపకరణాలను లినక్స్ నుంగును కలిపి
పరిపూర్ణ గ్ను/లినక్సు నిర్వహణా వ్యవస్థ ను తయారు చేసారు.

linux ను లినక్స్ అని పలుకాలి లైనక్స్ లేక లినుక్స్ అని కాదు!
లెబెల్స్:
గ్నూ/లినక్స్,
లినక్సు,
లినక్స్,
లైనక్స్
31, డిసెంబర్ 2010, శుక్రవారం
డెబియన్ ఇన్స్టాలర్ ఇకనుంచి తెలుగులో...
అర్జున రావు గారి కృషి/తోట్పాటు వల్ల ఇకనుంచి త్వరలోనే మనందరం డెబియన్ మరియు ఆధారిత ఆపరేటింగ్ సిస్టంల స్థాపన ప్రక్రియను తెలుగులో ప్రారంభించవచ్చు.సాధారణంగా మనం ఆపరేటింగ్ స్థాపన మొదలుపెట్టేటప్పుడు మొదటగా మనం (ఆంగ్లంలో) భాషను ఎంచుకుని ప్రారంభిస్తాము ఇదే పనిని మీరు సులభంగా ఇప్పటినుంచి తెలుగులో కూడా చెయ్యవచ్చు.డెబియన్ వారు తొందరలోనే వారి కొత్త వెర్షన్ డెబియన్ 6.0 Squeeze విడుదల చెయ్యటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ వెర్షన్ ను మీరు తెలుగులోనే స్థాపించవచ్చు.
అర్జున రావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ఈ ప్రక్రియను నేను పరీక్షించాను మీ ముందు స్థాపక ప్రక్రియ తెరచాపలను ఉంచుతున్నాను వీక్షించి మీ అభిప్రాయాలను తెలుపుతారని ఆశిస్తున్నాను. దీనిని మీరు తెలుగులినక్స్ యు ట్యూబ్ ఛానల్లో కూడా చూడవచ్చు.
లెబెల్స్:
గ్నూ/లినక్స్,
డెబియన్,
తెలుగు,
లినక్సు,
లినక్స్,
లైనక్స్,
telugu linux,
telugulinux
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)