26, సెప్టెంబర్ 2010, ఆదివారం

అత్యంత ప్రజాదరణ పొందిన లినక్స్ పంపకాలు

అత్యంత ప్రజాదరణ పొందిన లినక్స్ విస్తరణలు

లినక్స్ లో చాలా రకాలు ఉన్నాయి సుమారుగా ౩౦౦ కానీ వీటిలో ముఖ్యమైన మరియు ప్రజాదరణ పొందినవి మాత్రం కొన్ని ఉన్నాయి వీటి ఫై ఆధారపడి కొన్ని ఇతర రకాలు కూడా పనిచేస్తున్నాయి.అవే డెబియన్, రెడ్ హాట్,ఓపెన్ స్యుస్.
డెబియన్ లో పాకేజ్ ఫైళ్లు .deb ఫార్మేట్ లో ఉంటే రెడ్ హాట్ లో .rpm (Redhat Package Manager)లో ఉంటాయి. అంటే విండోస్ లో .exe  ఫైల్స్ లాగా అన్నమాట.
      ముందుగా డెబియన్ గురించి మాట్లాడుకుందాం, డెబియన్ లినక్స్ వెనుక చాలామంది అభివృద్ధి చేసేవారి కృషి ఉంది.ఏ ఇతర లినక్స్ లోను అందించని పాకేజ్ లను ఇందులో పొందవచ్చు. 25,000 వేలకు ఫైచిలుకు పాకేజ్ లు లభ్యమవుతాయి.
      ఇక రెడ్ హాట్ విషయానికి వస్తే దీనిని ఇప్పుడు ఎక్కువగా అంతర్జాల అల్లికలకు వాడుతున్నారు అంటే సర్వర్లు కోసం వినియోగిస్తున్నారు అంటే కమర్షియల్ వినియోగం అన్నమాట.దీని అర్ధం డెస్క్టాపు అవసరాలకు పనికిరాదని కాదు.డెబియన్ తో పోలిస్తే దొరికే పాకేజ్ లు తక్కువనే చెప్పాలి.

డెబియన్ మరియు దానిపైన ఆధారపడిన ఇతర పంపకాలు:
డెబియన్ లినక్స్ ఒక సంపూర్ణమైన ఆపరేటింగ్ వ్యవస్థగా చెప్పుకోవచ్చు అత్యధిక పాకేజ్ లతో లభ్యమవుతున్న ఏకైక లినక్స్ డెబియన్.చాలా మట్టుక్కు అంతర్జాలంతో పనిలేకుండా కేవలం సిడి లేదా డివిడి లతోనే అన్ని పాకేజ్ లను ఇన్స్టాల్ చెయ్యవచ్చు.డెబియన్ ను అయిదు లేదా ఆరు డివిడి లలో లభ్యమవుతుంది.డెబియన్ ను ఇన్స్టాల్ చెయ్యటానికి ఆ అయిదు డిస్క్ లలో మొదటి డివిడి లేదా సిడి ఒక్కటి చాలు.దీనిలో సాధారణంగా కావలసిన అన్ని సాఫ్ట్వేర్ లు ఉంటాయి కానీ అప్ డేట్స్ ఇంకా ఇతర సాఫ్ట్వేర్ లు కావాలంటే మిగిలినవి అవసరమవుతాయి.
డెబియన్ లో పాటశాల విద్య కొరకు ఒక విస్తరణ వున్నది అదే డెబియన్ ఎడు లేదా స్కోల్ లినక్స్.

డెబియన్ లినక్స్ మీద ఆధారపడి పనిచేస్తున్నా ఒక ముఖ్యమైన పంపకమే ఉబుంటు లినక్స్.ఉబుంటు లినక్స్ చాలా ఆకర్షణీయమైన ఇంటర్ఫేసు కలిగిఉండి ఇట్టే ఆకర్షించే రీతిలో దీన్ని తీర్చిదిద్దారు.ఇది ఒక సాదారణ కంప్యూటర్ వినియోగదారుడికి కావాల్సిన అన్నిటిని ఒక సిడిలో పొందవచ్చు.దీనిని సులువుగా ఇన్స్టాల్ చేసుకోవడమే కాకుండా ఇన్స్టాల్ చేసుకోకుండా కూడా దీనిని ఉపయోగించవచ్చు.దీనినే లైవ్ సిడిగా పిలుస్తారు.ఉబుంటు ని ప్రతి సంవత్సరం రెండు దఫాలుగా విడుదల చేస్తారు ఒకటి ఏప్రిల్ లో మరల అక్టోబర్ లో.
ఉబుంటు లోనే కొన్ని రకాలు ఉన్నాయి అవి కుబుంటు, ఎడుబుంటు , క్సుబంటు, ఉబుంటు స్టూడియో, ఉబుంటు ఎంటర్ ప్రైజ్ ఎడిసన్.

ఉబుంటు గనోమ్ ఇంటర్ఫేసు ను కలిగి ఉంటుంది కానీ కుబుంటు కెడియి ఇంటర్ఫేసు తో వస్తుంది. కెడియి ఇంటర్ఫేసు విండోస్ లాగా వుంటుంది.ఎడుబంటు విషయానికి వస్తే దీనిని విద్య కొరకు రూపొందించినారు.దీనిలో విద్యకి సంబంధించిన అన్ని సాఫ్ట్వేర్ లను పొందవచ్చు.కుబుంటు లినక్సు కూడా చూడటానికి చాలా బాగుంటుంది.
ఉబుంటు స్టూడియోని ప్రత్యేకంగా ధ్వని, చిత్రాలు మరియు గ్రాఫిక్స్ వాడుటకు రూపొందించారు.
ఉబుంటు సర్వర్ ఎడిసన్ ను కేవలం సర్వర్ లు మరియు కమర్షియల్ ఉపయోగానికి వాడుతున్నారు.
క్సుబంటును చాలా తేలికగా పనిచేసేవిదంగా రూపొందించారు మరియు దీనిని కాన్ఫిగ్రేసన్ తక్కువ కంపూటర్లలలో కూడా వాడవచ్చు.

ఉబుంటు పై కూడా ఆధారపడి కొన్ని పంపకాలు పనిచేస్తున్నాయి అందులో లినక్స్ మింట్ ఒకటి దీనిలో కూడా నాలుగు రకాలు (GNOME, KDE, LXDE, Xfce  డెస్క్టాపు పర్యావరణాలు)ఉన్నాయి ఉబుంటులో వాటి మాదిరి.అన్ని లినక్స్ ఆపరేటింగ్ సిస్టంల కన్నా ఇదే అతి సులువైనది లినక్స్, మొదటిసారి వాడలనుకునేవారికి ఇది బాగుంటుంది.ఇబ్బందులేవీ లేకుండా సులబంగా వాడే రీతిలో దీనిని రూపొందించారు.
రెడ్ హాట్ ఇప్పుడు కేవలం అడ్వాన్స్డ్ సర్వర్లుగా కార్య నిమిత్తం వాడబద్తున్నది.అందువల్ల దీనిని ప్రస్తుతం ఉచితంగా అందించుట లేదు కానీ డెస్క్టాపు మరియు ఇతర వినియోగరులకు ఫెడోరా ను తయారు చేసారు రెడ్ హాట్ వారు.దీనిని మనం ఉచితంగానే పొందవచ్చు.ఇది కూడా ఒక ముఖ్య పంపకం.రెడ్ హాట్ మీద పనిచేస్తున్న ఇతర పంపకాలలో మాండ్రివా కూడా చెప్పుకోదగినదే.

ఓపెన్ స్యూజ్ లినక్స్ డెబియన్ మరియు రెడ్ హాట్ ల తర్వాత చెప్పుకోదగిన లినక్స్ పంపకం.దీనిని మొదట్లో స్యూజ్ లినక్స్ గా విడుదల చేసినా ఆ తర్వాత ఓపెన్ స్యూజ్ గా రూపాంతరం చెందింది.
సెంట్ ఓఎస్ రెడ్ హాట్ కు మంచి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు ఉచితంగా సర్వర్ వాడుకోవలునుకుంటున్నవారు దీనికి మొదటి ప్రాధాన్యత ఇవ్వవచ్చు.

ఈ టపాలో వివరించిన లినక్స్ పంపకాల లంకెలు.

24, సెప్టెంబర్ 2010, శుక్రవారం

ఉచిత సాఫ్ట్వేర్ ఉద్యమం మరియు దాని చరిత్రఉచిత సాఫ్ట్వేర్ గురించి చెప్పే ముందు మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైనది ఏమిటంటే అసలు సాఫ్ట్వేర్ అంటే ఏమిటి..?
 
కంప్యూటర్ సాఫ్ట్వేర్ లేదా సాఫ్ట్వేర్ అంటే కంపూటర్ ఏమి చెయ్యాలో తెలిపే కంప్యూటర్ కి సంబందించిన ప్రోగ్రాంల సమూహాన్ని కలిపి సాఫ్ట్వేర్ అంటారు.ఈ ప్రోగ్రాం లలో ఆదేశాలు, ఆజ్ఞలు వరుస క్రమంలో పేర్చబడి ఉంటాయి.
 
ఉచిత సాఫ్ట్వేర్ అనేది కూడా సాఫ్ట్వేరే కాకపోతే దీని పంపకం అనేది ఎలా ఉంటుందంటే దీనిని ఏ పనికైనా ఉపయోగించే సౌకర్యం మనకి కల్పిస్తుంది.అంటే ఉచిత సాఫ్ట్వేర్ ని మీరు నకలు తీసి పంచవచ్చు,సోర్సు కోడ్ ను క్షున్నంగా పరిశీలించవచ్చు, సవరించవచ్చు కూడా.ఉచిత సాఫ్ట్వేర్(ఫ్రీ సాఫ్ట్వేర్) అనే పదాన్ని 1983 లో తీసుకొని దాని ఉద్దేశ్యాన్ని,దిశా నిర్దేశాన్ని సూచించారు.అందులో 'ఉచిత' అనేది ఉచితంగా వచ్చే దాని కంటే మరింత స్వేచ్చను వాడుకరులకు ఇచ్చేదిగా ఉండాలి అని పేర్కొన్నారు.ఫ్రీ సాఫ్ట్వేర్ కు గత్యంతరముగా 'సాఫ్ట్వేర్ లిబరే' మరియు 'ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్' [FOSS] లను కూడా చేర్చారు.
ఉచిత సాఫ్ట్వేర్ ఉద్యమం [Free Software Movement] 1983 లో ప్రారంభమయ్యింది, దీని లక్ష్యం ఒక్కటే అధినాయకత్వ సాఫ్ట్వేర్ [proprietary software]లకు బదులుగా [replacement] ఉచిత సాఫ్ట్వేర్ ను రూపొందించడమే.అదే సంవత్సరం ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ ను[fsf.org] కూడా స్థాపించారు.అధినాయకత్వ సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందంటే ఆ సాఫ్ట్వేర్ చట్టపరమైన హక్కులన్నీ అధినేతకి చెందడమే కాకుండా, సాఫ్ట్వేర్ ని కొన్నవారుకి సాఫ్ట్వేర్ కొన్ని వినియోగ నిబంధనలతో, ఇతర వినియోగాన్ని [నకలు తీయడం,సవరించటం] నిషేదిస్తూ సాఫ్ట్వేర్ ను ఇస్తారు.
ఈ ఉద్యమం నుండి పుట్టినవే గ్నూ, ది లినక్స్ కెర్నల్, మొజిల్లా ఫైరుఫాక్సు, ఓపెన్ ఆఫీస్ సాఫ్ట్వేర్ స్యూట్, ఇతర నెట్వర్క్ సెర్వర్స్, ఫ్రీ బిఎస్డి, సాంబ మరియు అపాచి.  
ఉచిత సాఫ్ట్వేర్ ఉద్యమమే లేకుంటే ఒక ఉబుంటు కానీ ఫైరుఫాక్సు కానీ ఓపెన్ ఆఫీసు, విఎల్సి మీడియా ప్లేయర్..లను ఊహించగలరా..?

19, సెప్టెంబర్ 2010, ఆదివారం

ముందుమాట..!

నా గురించి చెప్పాలంటే నేను ఒక ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్ధి.నాకు కంప్యూటర్ విద్య మీద చాలా మక్కువ ఎక్కువ.అందరికి అది అందుబాటులో ఉంటే మంచిదని ఆశిస్తున్నాను.లినక్స్ గురించి సరైన అవగాహనా లేకపోవడం వాళ్ళ చాలా మంది లినక్స్ ఆపెరేటింగ్ సిస్టం కష్టమేమోనని అనుకుంటారు నిజానికి అది అంత కష్టమేమి కాదు. ఇప్పుడు మరిన్ని హంగులతో userfriendly interface, layout తో తయారు చెయ్యబడింది అంతే కాకుండా దాదాపు అన్ని ముఖ్యమైన బాషలలోను లభిస్తుంది. తెలుగులో కూడా...!
అందుకని మీరు కూడా లినక్స్ వాడటానికి ఇష్టపడతారని ఆశిస్తా!
ఉచిత సాఫ్ట్వేర్,
లినక్స్ వాడకం పెంచటానికి మరియు లినక్స్లో సమస్యలను తొలగించడమే ఈ బ్లాగు ముఖ్య ఉద్దేశ్యం.