లినక్స్ మింట్ యొక్క సరికొత్త విడుదల "మాయ" విడుదలైంది. ఈ విడుదల ఉబుంటు 12.04
నుండి నిర్మించబడింది. ఈ విడుదల రెండు రూపాలలో లభిస్తున్నది. గ్నోమ్ 2
వాడుకరులకు మంచి ప్రత్యామ్నాయాలైన మేట్ 1.2 మరియు సినెమెన్
1.4.అంతరవర్తులతో వస్తున్నది. లినక్స్ మింట్ 13 ఒక దీర్ఘకాలిక మద్ధతు(LTS)
గల విడుదల, దీనికి ఏప్రిల్ 2017 వరకూ మద్ధతుంది.
తెరపట్టులు
మేట్ 1.2 సినెమెన్ 1.4
సరికొత్త డిస్‌ప్లే మ్యానేజర్ MDM
MDM (మింట్ డిస్‌ప్లే మ్యానేజర్)
ఒక సరికొత్త తెర నిర్వాహకం, ఇది గ్నోమ్ డిస్‌ప్లే మ్యానేజర్ 2.20 ద్వారా
నిర్మించబడింది. ఇప్పుడున్న అన్ని తెర నిర్వాహకాల కంటే ఎక్కువ విశిష్టతలతో
కూడి ఉన్నది.ఇందులో మీ డెస్కుటాపును మలచుకునేందుకు వీలుగా చిత్రరూపంతో
కూడిన స్వరూపణ పనిముట్లు మరియు భాష ఎంపిక, స్వయంచాలక ప్రవేశం వంటివి
ఉన్నాయి.