15, జూన్ 2012, శుక్రవారం

స్కైప్ 4.0 లినక్స్ రూపాంతరం విడుదలైంది

ప్రముఖ యాజమాన్య VoIP (వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్) కక్షిదారు(క్లయింటు) అయిన స్కైపును మైక్రోసాఫ్ట్ సంస్థ కొనుగోలు చేసిన తరువాత లినక్సుకు మద్ధతు ఉండదేమో అని అందరూ భావించారు. కానీ అటువంటిదేమీ జరగలేదు. దాదాపు కొనుగోలు చేసిన ఏడాది తరువాత సరికొత్త రూపాంతరాన్ని విడుదల చేసింది. స్కైప్ 2.2 తరువాత నేరుగా స్కైప్ 4.0 విడుదలైంది. ఈ విడుదల యొక్క సంకేతనామం "ఫోర్ రూమ్స్ ఫర్ ఇంప్రూవ్‌మెంట్". సుదీర్ఘకాలం తరువాత విడుదలయిన ఈ రూపాంతరంలో విశిష్టతలేమిటో చూద్దాం.

ఈ రూపాంతరంలో ప్రత్యేకతలు
  •  ఆడియో, వీడియో నాణ్యతను మెరుగుపరిచారు.
  • అదనపు వెబ్ క్యామ్ మద్ధతు
  • చాట్ చరిత్ర నింపుట మరింత వేగం
  • క్రాష్ లేదా ఫ్రీజ్ అయ్యే అవకాశాలు తక్కువ
  • సంభాషణల సమకాలీకరణను మెరుగుపరిచారు
  • సరికొత్త స్థితి ప్రతీకలు మరియు హావభావాల చిహ్నాలు
  • ట్యాబ్స్ ద్వారా సంభాషణ
  • సంభాషణ మరియు కాల్ వీక్షణలలో మార్పులు
గమనిక: మీ వ్యవస్థలో స్కైప్ 2.2 స్థాపించబడివుంటే ప్యాకేజీల సంఘర్షణ తలెత్తకుండా ఉండాలంటే ముందుగా పాత ప్యాకేజీని తొలగించి తరువాత సరికొత్త ప్యాకేజీని స్థాపించుకోండి

ప్రస్తుతం డెబియన్, ఉబుంటు మరియు ఫెడోరా, ఓపెన్‌స్యూజ్ పంపకాలకు మాత్రమే ప్యాకేజీలు అందుబాటులోవున్నాయి. ఇతర పంపకాల వాడుతున్న వారు కనీసం కంపైల్ చేసుకుని స్థాపించుకుందామనుకుంటే, సోర్సుకోడు అందుబాటులో లేదు.
 

4 కామెంట్‌లు:

ఫోటాన్ చెప్పారు...

ఎలా అప్డేట్ చేసుకోవాలి?

Unknown చెప్పారు...

పాత వర్షన్ నుండి నేరుగా అప్డేట్ చేయడం కుదరదు, పైన పేర్కొన్న లంకెకు వెళ్లి "Download now" అనే బొత్తాంపై కర్సర్ ఉంచినట్లయితే వివిధ లినక్స్ పంపకాల పేర్లు ఆర్కిటెక్చర్‌తో సహా చూపిస్తుంది, మీకు కావలసినదానిని ఎంచుకొని దింపుకోండి. ఆ తరువాత క్రింది ఆదేశం ద్వారా ప్యాకేజీని స్థాపించుకోండి.
మీరు ఉబుంటు/డెబియన్ వాడుతుంటే,
$~cd Downloads
$~ sudo dpkg -i skype-debian_4.0.0.7-1_i386.deb
లేదా జిడెబి ప్యాకేజీని స్థాపించుకుని,
$~ sudo apt-get install gdebi
దింపుకున్న దస్త్రాన్ని జిడెబి ద్వారా తెరచి స్థాపించుకోండి. అదేవిధంగా సాఫ్టువేర్ సెంటర్ మరియు గ్నోమ్ ప్యాకేజీ కిట్ ద్వారా కూడా స్థాపించుకోవచ్చు.

ఫోటాన్ చెప్పారు...

Thank you Pravin Garu :)

Unknown చెప్పారు...

స్వాగతం...