ఉచిత సాఫ్ట్వేర్ గురించి చెప్పే ముందు మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైనది ఏమిటంటే అసలు సాఫ్ట్వేర్ అంటే ఏమిటి..?
కంప్యూటర్ సాఫ్ట్వేర్ లేదా సాఫ్ట్వేర్ అంటే కంపూటర్ ఏమి చెయ్యాలో తెలిపే కంప్యూటర్ కి సంబందించిన ప్రోగ్రాంల సమూహాన్ని కలిపి సాఫ్ట్వేర్ అంటారు.ఈ ప్రోగ్రాం లలో ఆదేశాలు, ఆజ్ఞలు వరుస క్రమంలో పేర్చబడి ఉంటాయి.
ఉచిత సాఫ్ట్వేర్ అనేది కూడా సాఫ్ట్వేరే కాకపోతే దీని పంపకం అనేది ఎలా ఉంటుందంటే దీనిని ఏ పనికైనా ఉపయోగించే సౌకర్యం మనకి కల్పిస్తుంది.అంటే ఉచిత సాఫ్ట్వేర్ ని మీరు నకలు తీసి పంచవచ్చు,సోర్సు కోడ్ ను క్షున్నంగా పరిశీలించవచ్చు, సవరించవచ్చు కూడా.ఉచిత సాఫ్ట్వేర్(ఫ్రీ సాఫ్ట్వేర్) అనే పదాన్ని 1983 లో తీసుకొని దాని ఉద్దేశ్యాన్ని,దిశా నిర్దేశాన్ని సూచించారు.అందులో 'ఉచిత' అనేది ఉచితంగా వచ్చే దాని కంటే మరింత స్వేచ్చను వాడుకరులకు ఇచ్చేదిగా ఉండాలి అని పేర్కొన్నారు.ఫ్రీ సాఫ్ట్వేర్ కు గత్యంతరముగా 'సాఫ్ట్వేర్ లిబరే' మరియు 'ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్' [FOSS] లను కూడా చేర్చారు.
ఉచిత సాఫ్ట్వేర్ ఉద్యమం [Free Software Movement] 1983 లో ప్రారంభమయ్యింది, దీని లక్ష్యం ఒక్కటే అధినాయకత్వ సాఫ్ట్వేర్ [proprietary software]లకు బదులుగా [replacement] ఉచిత సాఫ్ట్వేర్ ను రూపొందించడమే.అదే సంవత్సరం ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ ను[fsf.org] కూడా స్థాపించారు.అధినాయకత్వ సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందంటే ఆ సాఫ్ట్వేర్ చట్టపరమైన హక్కులన్నీ అధినేతకి చెందడమే కాకుండా, సాఫ్ట్వేర్ ని కొన్నవారుకి సాఫ్ట్వేర్ కొన్ని వినియోగ నిబంధనలతో, ఇతర వినియోగాన్ని [నకలు తీయడం,సవరించటం] నిషేదిస్తూ సాఫ్ట్వేర్ ను ఇస్తారు.
ఈ ఉద్యమం నుండి పుట్టినవే గ్నూ, ది లినక్స్ కెర్నల్, మొజిల్లా ఫైరుఫాక్సు, ఓపెన్ ఆఫీస్ సాఫ్ట్వేర్ స్యూట్, ఇతర నెట్వర్క్ సెర్వర్స్, ఫ్రీ బిఎస్డి, సాంబ మరియు అపాచి.
ఉచిత సాఫ్ట్వేర్ ఉద్యమమే లేకుంటే ఒక ఉబుంటు కానీ ఫైరుఫాక్సు కానీ ఓపెన్ ఆఫీసు, విఎల్సి మీడియా ప్లేయర్..లను ఊహించగలరా..?
ఈ ఉద్యమం నుండి పుట్టినవే గ్నూ, ది లినక్స్ కెర్నల్, మొజిల్లా ఫైరుఫాక్సు, ఓపెన్ ఆఫీస్ సాఫ్ట్వేర్ స్యూట్, ఇతర నెట్వర్క్ సెర్వర్స్, ఫ్రీ బిఎస్డి, సాంబ మరియు అపాచి.
ఉచిత సాఫ్ట్వేర్ ఉద్యమమే లేకుంటే ఒక ఉబుంటు కానీ ఫైరుఫాక్సు కానీ ఓపెన్ ఆఫీసు, విఎల్సి మీడియా ప్లేయర్..లను ఊహించగలరా..?
3 కామెంట్‌లు:
I appreciate your hard work but see one thing in this world nothing is free
@prasad
ఫ్రీ అంటే ఉచితం అని అర్థం చేస్కోకండి
ఫ్రీ అంటే ఇక్కడ భావం స్వేచ్ఛ అని
ఆంగ్లంలో రెండిటికీ ఒకే పదాన్ని వాడతారు కాబట్టీ చాలా మంది అపోహపడతారు, మొదట్లో నేనూ అంతే
అయితే ధరకు లభించే ఫ్రీసాఫ్ట్వేర్లు చాలానే ఉన్నాయి
ఉదాహరణకుః రెడ్ హ్యాట్, స్యూసీ వంటివి పూర్తి కమర్షియల్
ఇక్కడ నిబద్ధత ఏంటంటే కోద్ ని కూడా సాఫ్ట్వేర్ తో పాటుగా అన్దిన్చాలి
ప్రసాద్ గారు,రహ్మానుద్దీన్ షేక్ గారు
ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే ఓపెన్ సోర్సు, ఫ్రీవేర్ మరియు షేర్ వేర్ లకు చాలా వ్యత్యాసం వుంది.వీటి మధ్య ఉన్న వ్యత్యాసం ఇక్కడ గమనించగలరు
ఫ్రీవేర్, ఒపెన్ సోర్స్, షేర్ వేర్ మద్య వ్యత్యాసం ఏమిటి?
సాఫ్ట్వేర్ స్వేచ్చ మీద చాలా మంది చాలా రకాలుగా చెప్పారు కానీ వారి అందరి ఉద్దేశ్యం మాత్రం ఒక్కటే అని చెప్పవచ్చు.స్వేచ్చ సాఫ్ట్వేర్ లేదా ఫ్రీ సాఫ్ట్వేర్ అనేది వినియోగించే వారికీ స్వేచ్చ ఇచ్చేదిగా ఉండాలి.మీరు అన్నట్లుగా రెడ్ హట్ ఇప్పుడు కమర్షియల్ గా అయ్యింది కానీ అది కూడా మొదట్లో ఓపెన్ సోర్సు అనేది వాస్తవం ఇంకొకటి ఏమిటంటే రెడ్ హట్ యొక్క కోడు విడి విడిగా ఉచితంగా లభిస్తుంది, కానీ దానినంతటినీ ఒకే సాఫ్ట్వేరుగా వారు మలచలేదని గుర్తించాలి.
చివరగా స్వేచ్చ సాఫ్ట్వేర్ (ఓపెన్ సోర్సు) ను కావాలంటే కొనే మరియు అమ్మే హక్కులు వినియోగించే వారికి వుంది అనే విషయాన్నీ గమనించాలి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి