29, జనవరి 2011, శనివారం

లినక్స్ లో వెబ్ క్యాం (జాలపు క్యామెరా) మృదోపకరణం

మీ అంకోపరిలో వెబ్ క్యాం ఉంది, కానీ లినక్స్ లో దానిని ఎలా వాడటం అన్నది మీ సందేహమైతే ఇక్కడ చూడండి.
లినక్స్ లో వెబ్ క్యాం కై ఎన్నో మృదోపకరణాలు ఉన్నయి, కానీ అన్నిటిలో నేను వాడి, అందరినీ వాడమని సలహా ఇచ్చే ఉపకరణం -- చీజ్.
ఇది మీరు తెలుగులినక్స్ నందు వాడుతుంటే చీజీ గా కనబడవచ్చు.
మీరు ఈ ఉపకరణాన్ని స్థాపించడానికి సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ నుండి cheese అను పదాన్ని వెతికి ఆ పదంతో ఉన్న సాఫ్ట్వేర్ను ఇంస్టాల్ చెయ్యండి.
మీరు ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ నుండి ఇంస్టాల్ చెయ్యాలనుకుంటే, చీజ్ మ్యూజిక్ అండ్ వీడియో అను విభాగంలో ఉంటుంది, ఇంస్టాల్ చేసాక. ఎంచక్కా మీరు వెబ్ క్యాం ని వాడుకోవచ్చు.
మీకు అంతేకాక రకరకాల ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి.
ఉదాహరణకి కింద గల స్క్రీంషాట్స్ చూడండి.




6 కామెంట్‌లు:

Praveen Mandangi చెప్పారు...

ఫెడోరా లినక్స్‌లో వెబ్ కెమెరా
http://lh3.ggpht.com/_eR2u-48gOmQ/TUNyWk4xEMI/AAAAAAAAA4c/wCp1xDSzhXA/s512/screenshot0003.png

అజ్ఞాత చెప్పారు...

అంకోపరి అంటే లా౨ప్‌టాపు.
పి.సి.కాదు.

రహ్మానుద్దీన్ షేక్ చెప్పారు...

దేవనకొండ గారుఉ, అంకోపరి అన్నదే నా ఉద్దేశ్యం కూడా
పీసీలో వెబ్ కెమెరాను మళ్ళీ వేరుగా అమర్చుకోవాలి. అంకోపరిలో అయితే దాదాపుగా ఉంటుంది!

సుజాత వేల్పూరి చెప్పారు...

కెమెరాకు కూడా తెలుగు పదం చెప్పండి రహమాన్ గారూ!

Pranav Ainavolu చెప్పారు...

నిశ్చల ఛాయా గ్రహకం అంటే ఎలా ఉంటుంది? :)

Unknown చెప్పారు...

జాలపు ఛాయాగ్రాహకం తో చలనచిత్రం కూడా తీయవచ్చు కాబట్టి ఛాయాగ్రాహకం అంటే సరిపోతుందేమో!