24, మే 2012, గురువారం

లినక్స్ మింట్ 13 విడుదలైంది...

లినక్స్ మింట్ యొక్క సరికొత్త విడుదల "మాయ" విడుదలైంది. ఈ విడుదల ఉబుంటు 12.04 నుండి నిర్మించబడింది. ఈ విడుదల రెండు రూపాలలో లభిస్తున్నది. గ్నోమ్ 2 వాడుకరులకు మంచి ప్రత్యామ్నాయాలైన మేట్ 1.2 మరియు సినెమెన్ 1.4.అంతరవర్తులతో వస్తున్నది. లినక్స్ మింట్ 13 ఒక దీర్ఘకాలిక మద్ధతు(LTS) గల విడుదల, దీనికి ఏప్రిల్ 2017 వరకూ మద్ధతుంది.

తెరపట్టులు
 

 మేట్ 1.2                                                  సినెమెన్ 1.4

సరికొత్త డిస్‌ప్లే మ్యానేజర్ MDM

MDM (మింట్ డిస్‌ప్లే మ్యానేజర్) ఒక సరికొత్త తెర నిర్వాహకం, ఇది గ్నోమ్ డిస్‌ప్లే మ్యానేజర్ 2.20 ద్వారా నిర్మించబడింది. ఇప్పుడున్న అన్ని తెర నిర్వాహకాల కంటే ఎక్కువ విశిష్టతలతో కూడి ఉన్నది.ఇందులో మీ డెస్కుటాపును మలచుకునేందుకు వీలుగా చిత్రరూపంతో కూడిన స్వరూపణ పనిముట్లు మరియు భాష ఎంపిక, స్వయంచాలక ప్రవేశం వంటివి ఉన్నాయి.
 


2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఇందులోనూ ఉబుంటు లాగా సినాప్టిక్ లేకుంటే స్టోర్ ఉంటుందా ప్రవీణ్ గారు?
మీరు ఏది ప్రిఫర్ చేస్తారు? ఉబుంటు నా లేక మింట్ న?

Unknown చెప్పారు...

ఉబుంటు, లినక్స్ మింట్ ఏదోవిధంగా రెండూ డెబియన్ ఆధారితాలే కాబట్టి ఎక్కువగా డెబియన్ వాడటానికే ప్రాధాన్యమిస్తాను. కాకపోతే డెబియన్ కొత్త వారికి సూచించదగినది కాదు ఎందుకంటే నేను ముందుగా డెబియన్‌తో ప్రారంభించాను కానీ ఉబుంటుకి మారిపోయాను ఎందుకంటే ప్రారంభంలో డెబియన్ రుచి తెలియదు. ఆ తరువాత కొన్నాళ్లకు డెబియనుకు మారిపోయి డెబియనీర్ అయిపోయా...
మీకు ఇదివరకు లినక్స్ వాడిన అనుభవం లేకుంటే మీరు లినక్స్ మింట్‌తో ప్రారంభించడం మంచిదనుకుంటాను, ఉబుంటు కంటే లినక్స్ మింట్ మరింత అనురూపిత పంపిణీ, సరళంగా ఉంటుంది. లినక్స్ మింట్‌లో వేరేగా డెబియన్ ఎడిషన్ ఉన్నది, ఇది నేరుగా డెబియన్ టెస్టింగ్ నుండి తీసుకుని రూపొందించినది. లినక్స్ మింట్‌లో ప్యాకేజీలు స్థాపించుటకు లినక్స్ మింట్ సాఫ్టువేర్ మ్యానేజర్ ఉంటుంది లేదా మీరు సినాప్టిక్ కూడా స్థాపించుకోవచ్చును.