లినక్స్ 20వ వార్షికోత్సవం జరుపుకుంటుంది. లినక్స్ గురించి ఇప్పటివరకూ తెలియని వారు, తెలుసుకోవాలనుకుంటున్నవారు ఒకసారి లినక్స్ కథను చూడండి. ఈ వీడియోలో లినక్స్ చరిత్రను మరియు దీని వెనుక ఉన్న ముఖ్య వ్యక్తుల కృషి గురించి తెలుసుకుంటారు. ఈ సందర్భంగా లినక్స్ ఫౌండేషన్ ఒక వీడియో పోటీని కూడా నిర్వహిస్తుంది.
అవగాహన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అవగాహన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
8, ఏప్రిల్ 2011, శుక్రవారం
లినక్స్ కథ...
14, ఫిబ్రవరి 2011, సోమవారం
లినక్స్ ఎందుకు?
ఈ టపా ఇంతక ముందు రాసిన లినక్స్ అంటే ఏమిటి? అన్న టపా కు తరువాయి భాగం.
లినక్స్ కొన్ని అద్వితీయమైన ఉత్తమమైన సాఫ్ట్వేర్లకు నెలవు. అంతకంటే ఉత్తమమైన విషయం ఇవి ఉచితంగా లభించడం. చట్టరీత్యా విండోస్ లేక అడోబ్ వారిచ్చే వీడియో లేక ఆడియో ప్లేయర్లకు వారు మనవద్ద రుసుము తీసుకొనవచ్చు, అలా కాకపోతే అది అనైతికం అవుతుంది. కానీ లినక్స్ తో ఆ చిక్కులు లేవు.
లినక్స్ తోవచ్చే కొన్ని ప్రముఖమైన సాఫ్ట్వేర్లు:
లినక్స్ లోని అన్ని ప్రకల్పాలు(ప్రాజెక్టులు) దాదాపు ఇదే విధంగా పని చేస్తాయి.
లినక్స్ అవగాహనలో ఇది రెండవ మజిలీ.
మీకిప్పుడు లినక్స్ అంటే ఏమిటో తెలిసింది.
కానీ అది మీరు విండోస్ లేక మ్యాక్ ను వదిలి లినక్స్ వాడుకర్లు కావటానికి దోహదం చేయదు.
లినక్స్ యునిక్స్ కన్నా ఎన్నోరెట్లు ప్రత్యేకమైనది. అదెలా?
ఇందుకు గల ముఖ్య కారణం లినక్స్ కు ఉన్న లైసెంస్ -- "ఓపెన్ సోర్స్"
లినక్స్ ఒక సంపూర్ణ ఓపెన్ సోర్స్ నిర్వహణా వ్యవస్థ, అదెలా?
ఇలా:
- లినక్స్ వాడే గ్నూ జెనరల్ పబ్లిక్ లైసెన్స్ ప్రకారం, మీరు లినక్స్ ను ఉచితంగా పొందవచ్చు, దాని మూలపదాల్ని కూడా పొంది, మార్పులు చేసి మరలా అందరికీ అందుబాటులో ఉంచవచ్చు. మరియు ఇలా తిరిగి పంచేప్పుడు కావాలంటే ఒక ధర నిర్ణయించి ఆ ధరకు అమ్మవచ్చుకూడా!
- లినక్స్ మూల పదాలు(సోర్స్ కోడ్) అందుబాటులో ఉండటం వలన అలా రూపొందే సాఫ్ట్వేర్ లో సాధారణం కంటే తక్కువ లోపాలు(బగ్స్) ఉంటాయి, మరియు అవి కూడా వెంటనే నివృత్తి చేయబడి, లోపరహితంగా ఉండే లినక్స్ అందుబాటులో ఉంటుంది.
- ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అంటే అది ఎటువంటి ప్లాట్ఫాం అయినా పనిచేస్తోంది. వహనీయత చాలా విస్తృతం.
- నమ్మదగిన సాఫ్ట్వేర్ ఎందుకంటే మూలపదాలు మనవద్ద ఉండటంవలన మన దస్త్రాలు లేక మన సమాచారం ఏ-ఏ మార్పులకు లోనవుతుందో మనకు తెలుసు, అందువల్ల సమాచారచౌర్యం(data stealing, eavesdropping) వంటి సమస్యలు ఉండవు.
- ఏదో ఒకరోజు ఫలానా సాఫ్ట్వేర్ కంపెనీ జెండా ఎత్తేస్తే ఆ సాఫ్ట్వేర్ అందుబాటులో ఉండదు అన్న సమస్య నెట్ స్కేప్ వాడుకర్లకు నెట్స్కేప్ బ్రౌజరు నిలిపివేత తరువాత ఎదురైంది. అలా ఏనాటికీ లినక్స్ మూసివేత ఉండదు.
- ఇది ఉచితం! మరియు ఎటువంటి సాంకేతిక సహాయం కావాలన్నా మేమున్నాం! :)
అంటే, మీకు డబ్బూ ఖర్చు ఉండదు, మంచి నాణ్యతగల సాఫ్ట్వేర్ కూడా మీ స్వంతం!
మరి వాణిజ్యం? సాధారణంగా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ వ్యవస్థకు ఆదాయం సాంకేతిక సహాయం, పంపకాలు మరియు శిక్షణ ద్వారా వస్తాయి. ఇది ఒక వినూత్నమైన వ్యాపార సూత్రం, దీనిని ఇప్పటికే వాణిజ్యరంగంలో మహామహులైన ఐబీఎమ్, హెచ్ పీ, నోవెల్, సన్ , ఇన్టెల్ ఆచరణలో పెట్టారు. ఐటీకాని కంపెనీలు, ఉదాహరణకు బోయింగ్, గ్లాక్సోస్మి త్క్లైన్ , మొదలగునవి కూడా ఈ సూత్రాన్నే వాడుతూ ఓపెన్ సోర్స్ కు తమ వంతు తోడ్పాటు చేస్తున్నారు.
ఎంతటి క్లిష్టమైన పనినైనా చెయ్యటానికి లినక్స్ ఒక నమ్మదగిన వేదిక:
- విండోస్ వంటి వాటితో పోలిస్తే అనవసరపు ప్రోగ్రాంలతో లినక్స్ సమర్థవంతంగా పని చెయ్యటం వల్ల మీ సిస్టం క్రాష్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. మీ దస్త్రాలకు భద్రత.
- లినక్స్ లో ప్రస్తుతం వైరస్లు లేవు. లినక్స్ వంటి నిర్దిష్టమైన వ్యవస్థలో ప్రస్తుత వైరస్ లు చొరబడలేవు, పూర్తి వైరస్ తీరుతెన్నులు మారితే గానీ ఆ అవకాశం లేదు, అది ఇప్పట్లో సాధ్యం కాదు.
- ఇది పాత, మూలపడిన మీ హార్డ్వేర్ పై కూడా నడుపవచ్చు.
- యాంటివైరస్లకు ఇక స్వస్తి పలుకండి.
- సెక్యూరిటీ(భద్రత) అనేది ఇక్కడ ఒక భాగం, అదనపు విశేషం కాదు.
లినక్స్ కొన్ని అద్వితీయమైన ఉత్తమమైన సాఫ్ట్వేర్లకు నెలవు. అంతకంటే ఉత్తమమైన విషయం ఇవి ఉచితంగా లభించడం. చట్టరీత్యా విండోస్ లేక అడోబ్ వారిచ్చే వీడియో లేక ఆడియో ప్లేయర్లకు వారు మనవద్ద రుసుము తీసుకొనవచ్చు, అలా కాకపోతే అది అనైతికం అవుతుంది. కానీ లినక్స్ తో ఆ చిక్కులు లేవు.
లినక్స్ తోవచ్చే కొన్ని ప్రముఖమైన సాఫ్ట్వేర్లు:
గింప్ : ఫోటోషాప్ కు ధీటుగా అందుబాటులో ఉన్న ఫోటో కూర్పు సాఫ్ట్వేరు
ప్రముఖ మీడియా ప్లేయర్.
...ఇలా ఎన్నో ఎన్నెన్నో...
మరి అంతా ఉచితమయితే, నాకేమిటంటా?
మీరే కాదు చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడే పొరబడుతుంటాయి. చాలా వరకు లినక్స్ అంటే ఒక వ్యాపకం, అది కాలేజీ కుర్రాళ్ళకుండే ఒక చెడు వ్యసనం అని ఫీలయ్యేవాళ్ళు నేటికీ ఉన్నారూ( మా హెచ్ ఓడీ తోసహా)
అయితే ఇవన్నీ కేవలం అపోహలు. నిజాలు:
- ఎలా అయితే కార్పొరేట్ సాఫ్ట్వేర్లను పెద్ద కంపెనీలు కొని వాడుకుంటాయో అలానే లినక్స్ ను కూడా కొని వాడుతారు.
- ఇన్టెల్ వంటి బహుళజాతి సంస్థలు లినక్స్ లో భారీగా పెట్టుబడులు పెట్టి తద్ఫలితంగా వారు తయారుచేసిన హార్డ్వేర్ కు వెనువెంటనే పని చేయించే సాఫ్ట్వేర్ కేవలం లినక్స్ మాత్రమే ఇవ్వగలదు. విండోస్ వంటి సాఫ్ట్వేర్లు కొత్తగా వచ్చిన హార్డ్వేర్కు సరిపోవు.
- చైనా వంటి దేశాల్లో ౭౦% వరకూ అన్ని కంప్యూటర్లలోనూ లినక్స్ ను మాత్రమే వాడుతున్నారు.ఈ విధంగా ఆ దేశ పౌరులకు చాలా వరకు ధనం ఆదా అవుతుంది. తద్వారా కంప్యూటర్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.
- మరెన్నో కంపెనీలు వారి సర్వర్లను లినక్స్ కు మార్చుకుంటున్నారు, కారణం : రక్షణ మరియు భద్రత.
- అలానే ఈ విధంగా లినక్స్ ద్వారా, లేక ఇతర స్వేచ్ఛా సాఫ్ట్వేర్ల ద్వారా లాభం పొందిన వ్యక్తులు, విద్యార్థులు, సంస్థలు, విశ్వవిద్యాలయాలు, వారి వారి తోడ్పాటులను లినక్స్ కు తిరిగి అందించటం ద్వారా లినక్స్ మరింత ప్రభావవంతం అవుతున్నది. దీనికి మంచి ఉదాహరణ : వికీపీడియా. వికీపీడియా ఎటువంటి ఖర్చులేకుండా పూర్తి ఉచితంగా మీకు సమాచారాన్ని అందిస్తుంది, అందువల్లనే కోట్లాది మంది మరలా తిరిగి వికీపీడియాకు సమాచారాన్ని చేర్చి మరింత సమృద్ధి పరుస్తున్నారు.
లినక్స్ లోని అన్ని ప్రకల్పాలు(ప్రాజెక్టులు) దాదాపు ఇదే విధంగా పని చేస్తాయి.
లెబెల్స్:
అవగాహన,
గ్నూ/లినక్స్,
తెలుగు లినక్స్,
లినక్స్
7, ఫిబ్రవరి 2011, సోమవారం
డెబియన్ విడుదలల కథా కమామీషు
డెబియన్ సగటున 1.5 సంవత్సరాల వ్యవధిలో ఒక కొత్త వెర్షన్ విడుదల చేస్తుంది.అంటే దాదాపు 535 రోజుల వ్యవధిలో ఒక కొత్త వెర్షన్ విడుదల అవుతుంది.దీని అభివృద్ధి సాధారణంగా మూడు స్థితుల్లో జరుగుతుంది.వీటిని స్థిరమైన,పరీక్షించబడుతున్న,అస్థిరమైన దశలుగా విభజించారు.ఇందులో మొదటిగా అస్థిరమైన దశలో ఉన్న దానిని తీసుకుని అందులో గల లోపాలను కొంతవరకూ సరిచేసిన తర్వాత దానిని పరీక్షించబడుతున్న స్థితిలో ఉన్న దానిగా పరిగణించి దాంట్లో కూడా ఉన్న దోషాలను ఎప్పటికప్పుడు పరిశీలించి వాడుకరులనుంచి సేకరించి వాటిలోని ఉన్న దోషాలను కూడా పరిష్కరించి ఒక స్థిరమైన స్థితికి తీసుకువస్తారు అలా అ దశలో ఉన్న దానిని స్థిరమైనది(Stable)గా ప్రకటిస్తారు.డెబియన్ అభివృద్ధి క్రమంలో ఉన్నమూడు దశలు ఇక్కడ గమనించవచ్చు.
- Stable (స్థిరమైన)
- Testing (పరీక్షించబడుతున్న)
- Unstable (అస్థిరమైన)
డెబియన్ ప్రతీ విడుదలకూ ఒక పేరు ఉంటుంది కదా అది టాయ్ స్టోరీ అనే ఒక అంగ్ల చిత్రంలోని పాత్రలను తీసుకుని పెట్టడం జరుగుతుంది.డెబియన్ ప్రోజెక్టు ఎల్లప్పుడూ అస్థిర విడుదల మీద పని కొనసాగిస్తుంది.దీనినే "సిడ్ "(కోడ్ పేరు sid, ఇది కూడా టాయ్ స్టోరీ చిత్రంలో ఒక పాత్ర.సిడ్ అనే పేరు గల కుర్రాడు బొమ్మలను ధ్వంసం చేస్తూ అనందిస్తూ ఉండే ఒక దుష్టమైన పాత్ర.)గా పిలుస్తారు.ఇక ఈ పేరును డెబియన్ వారు ఎంతో తెలివిగా SID(Still in Developement)గా వాడుతున్నారు.ఇందులో కొత్తగా నవీకరించబడిన ప్యాకేజీలను స్థిరంగా ఉన్న కొత్త విడుదలకు జతచేసి తరువాయి స్థిరమైన విడుదలకు ప్రయత్నిస్తారు.ఈ విధంగా డెబియన్ విడుదల చక్రం తిరుగుతూ ఉంటుంది.డెబియన్ ఎల్లప్పుడూ ఒక స్థిరమైన విడుదలని వాడుకలో ఉంచుతుంది.ఎప్పుడైతే ఒక కొత్త వెర్షన్ విడుదలవుతోందో , అంతకు ముందు విడుదల అయిన వెర్షన్ కి మరో సంవత్సరం పాటు డెబియన్ రక్షణ బృందం వారు మద్ధతు అందిస్తారు.తరువాయి స్థిరమైన విడుదల అయ్యేవరకూ అస్థిర మరియు పరీక్షించబడుతున్న రెండు నిక్షేపాలను ఎడతెగకుండా నవీకరించి అభివృద్ధి చేస్తారు.మీరు డెబియన్ కు కొత్త అయితే స్థిరమైన వెర్షన్ వాడిండి.మీరు ఇంతకు పూర్వమే లినక్స్ వాడిన అనుభవం ఉంటేమరియు కొత్త సాప్ట్వేర్లు కోసం పరీక్షించబడుతున్న దానిని వాడవచ్చు.ఇప్పటివరకూ విడుదల అయిన క్రమాన్ని ఇక్కడ గమనించవచ్చు.
ప్రతీ విడుదలకూ కొత్త సాప్ట్వేర్లను మరియు ప్యాకేజీలను నవీకరిస్తూ, కొత్త నిర్మితాలకు(ఆర్కిటెక్చర్లకు) మద్ధతును పెంచుతూ డెబియన్ ముందుకు కొనసాగుతుంది.ఇప్పటి వరకూ విడుదల అయిన వెర్షన్లను ఒకసారి చూద్దాం.
- 1.1 Buzz (బజ్జ్-17 జూన్ 1996)
- 1.2 Rex (రెక్స్-12 డిసెంబర్ 1996)
- 1.3 Bo (బో-5 జూన్ 1997)
- 2.0 Hamm (హమ్మ్-24 జూలై 1998)
- 2.1 Slink (స్లింక్-9 మార్చి 1999)
- 2.2 Potato (పొటాటో-15 జూలై 2000)
- 3.0 Woody (వుడీ-19 జూలై 2002)
- 3.1 Sarge (సార్జ్-6 జూన్ 2005)
- 4.0 Etch (ఎట్చ్-8 ఏప్రిల్ 2007)
- 5.0 Lenny (లెన్ని-14 ఫిబ్రవరి 2009)
- 6.0 Squeeze (స్క్వీజ్-6 ఫిబ్రవరి 2011)
లెబెల్స్:
అవగాహన,
గ్నూ/లినక్స్,
డెబియన్,
స్వతంత్రం,
స్వేచ్ఛ
డెబియన్ -ది యూనివర్సల్ ఆపరేటింగ్ సిస్టం
డెబియన్ 1993లో ఇయాన్ ముర్డాక్ అనే పుర్డ్యు విశ్వవిద్యాలయ విద్యార్ధిచే సృష్టించబడింది.అతను లినక్స్ పంపకం అందరికీ అందుబాటులో డెబియన్ ప్రణాళిక ఉండేటట్లు రూపొందించాడు.డెబియన్ కు ఆ పేరు ఎలా వచ్చిందంటే అతని స్నేహితురాలి(ఇపుడు అతని భార్య ) పేరు డెబ్రా(DEBRA) లోని మొదటి మూడు అక్షరాలను తన పేరులోని(Ian Murdock) మొదటి మూడు అక్షరాలను కలిపి DEBIAN గా తయారయింది.దీనిని డెబియన్(deb-e′-en)అని పిలుస్తారు.
డెబియన్ అంటే చాలా మందికి తెలియదు మనవాల్లకి ఉబుంటునో లేదా లినక్స్ మింట్ వంటి వాటి గురించి తెలుసేమోగాని దీని గురించి మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు.అసలు వీటన్నిటికీ మూలమే డెబియన్.ఇది లినక్స్ కెర్నల్ను మరియు గ్నూ ఆపరేటింగ్ సిస్టం సాధనాలను వాడి చేయబడింది కనుక డెబియన్ గ్నూ/లినక్స్ గా కూడా పిలుస్తారుదీనిని డెస్క్టాపు మరియు సెర్వర్(సేవిక)గాను వాడుకోవచ్చు.డెబియన్ లినక్స్ యునిక్స్ మరియు ఉచిత సాప్ట్వేర్ సంబందిత తత్వాలను ఖచ్చితంగా అనుసరిస్తుంది.డెబియన్ అభివృద్దిచేసేవారు స్థిరమైన,దృఢమైన రక్షణతో తయారుచేయటానికే వారి దృష్టినికేంద్రీకరిస్తారు.ఇలా రూపొందించిన దానినే చాలా ఇతర లినక్స్ పంపకాలు ఆధారంగా వాడుకుంటాయి, వాటిలో ఉబుంటు,లినక్స్ మింట్ నాపిక్స్, గ్సాండ్రోస్లు ఇతర ఉన్నాయి.
అందరికీ అందుబాటులో ఉండే ఒక ఫ్రీ ఆపరేటింగ్ సిస్టం అభివృద్ధిపరచాలనేదే డెబియన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వేలాది స్వచ్ఛంద కార్యకర్తలచే మరియు లాభం ఆశించని స్వచ్ఛంద సంస్థల విరాలాలచే అభివృద్ధి చేయబడుతుంది.
డెబియన్ విరివిగా పొందగలిగిన సాప్ట్వేర్లకు,ఐచ్ఛికాలకు కొలువు.ప్రస్థుత స్థిర విడుదల 25 వేల సాప్ట్వేర్ ప్యాకేజీలను 12 వివిధ రకాల కంప్యూటర్ నిర్మితాలకు అందిస్తుంది.ఈ నిర్మితాలలో ఇంటెల్/AMD 32-బిట్/64-బిట్ నిర్మితాలు వ్యక్తిగత కంప్యూటర్లలో వాడబడుతుంటే, ARM నిర్మితాలలో ముఖ్యంగా ఎంబెడెడ్ సిస్టంలలో మరియు IBM సెర్వర్ మెయిన్ ఫ్రేమ్ లలో సాధారణంగావాడుతూ కనిపిస్తున్నాయి.డెబియన్ లో చెప్పుకోదగ్గ ముఖ్య మైనది APT ప్యాకేజీ మేనేజ్ మెంట్ సిస్టం, అధిక మొత్తంలో ప్యాకేజీలు, నిర్ణబద్దమైన ప్యాకేజీల విధానాలు, అధిక నాణ్యత కలిగిన విడుదలలు.ఈ పద్ధతి ద్వారా పాత ప్యాకేజీల నుండి కొత్తగా విడుదల అయిన ప్యాకేజీలను కావలిసిన వాటిని స్వయంచాలకంగా స్థాపించి అనవసరమైన ప్యాకేజీలను తొలగిస్తుంది.డెబియన్ మరియు దాని ఆధారిత సాప్ట్వేర్లన్నీ .deb అనే పొడిగింతతో ఉంటాయి,వీటిని డెబియన్ ప్యాకేజీలుగా పిలుస్తారు.వీటిని సులభంగా స్థాపించి వాడుకోవచ్చు.
డెబియన్ ప్రమాణిక స్థాపనలో GNOME డెస్క్టాప్ పర్యావరణం వాడబడుతుంది.ఇందులో లిబ్రేఆఫీసు,ఐస్ వీసెల్(ఫైర్ఫాక్స్ నకలీ), ఎవల్యుషన్ మెయిల్, CD/DVD వ్రైటింగ్ ప్రోగ్రాంలు, సంగీత మరియు వీడియో ప్లేయర్లు, చిత్రాల వీక్షక మరయు సవరణ సాప్ట్వేర్లు, మరియు PDF చదువరి సాప్ట్వేర్లు డెబియన్ స్థాపించినపుడే దానితో పాటే స్థాపించబడతాయి.ముందుగా తయారుచేయబడిన CD ఇమేజ్లు KDE సాప్ట్వేర్ల కంపైలేషన్, Xfce మరియు LXDE వంటి డెస్క్టాపు పర్యావరణాలకు కూడా అందుబాటులో ఉన్నాయి.
డెబియన్ ను డౌన్లోడు చేసుకోవాలంటే అక్కడ మనకు చాలా ఇమేజ్ ఫైళ్ళు కనిపిస్తాయి.DVD ఫైళ్ళు అయితే ఐదు లేదా CD ఫైళ్ళు ఐతే ముప్పయి వరకూ ఉంటాయి.వీటిని చూసి చాలా మంది డౌన్లోడు చేసుకోవడానికి కూడా సాహసించరు నిజానికి అందులో ఉన్న మొదటి ఒక్క డిస్కు సరిపోతుంది పూర్తి ప్రామాణిక స్థాపన కోసం.మిగిలిన డిస్కులలో సిస్టం స్థాపనకు అవసరం లేని అధిక సాప్ట్వేర్లను ఉంచుతారు.మీరు ఒకసారి మొదటి డిస్కు పెట్టి డెబియన్ స్థాపించన తరువాత మీరు నేరుగా అంతర్జాల సదుపాయం మీకు ఉంటే మిగిలిన మీకు కావలసిన సాప్ట్వేర్లను నేరుగా డౌన్లోడు చేసుకుని స్థాపించుకోవచ్చు.అలాకాకుండా మీకు నెట్ సదుపాయం లేకపోతే మిగిలిన డిస్కులను మీరు కలిగిఉంటే ఆ డిస్కులను పెట్టి నేరుగా వాటినుండి సాప్ట్వేర్లను స్థాపించుకోవచ్చు.వాటిని(మిగిలిన డిస్కులను) అందించటంలో ముఖ్య ఉద్ధేశ్యం అంతర్జాల సదుపాయం లేకుండా సాప్ట్వేర్లు స్థాపించుకునే వీలు కల్పించడమే.ఈ సిడి/డివిడి ఇమేజ్ (.iso)ఫైళ్ళను మీరు ఉచితంగా నేరుగా లేదా టోరెంట్లు లేదా jigdoల ద్వారా వివిధ పద్ధతులలో డౌన్లోడు చేసుకోవచ్చు లేదా ఆన్ లైన్ వర్తకుల నుండి కొనుక్కోవచ్చు.
మన దేశంలో వాడుకోలోనున్న సి-డాక్(C-DAC) వారి బాస్(భారతీయ ఆపరేటింగ్ సిస్టం సొల్యూషన్స్) మరియు స్వేచ్ఛ వంటివి కూడా డెబియన్ ఆధారితాలే...
లెబెల్స్:
అవగాహన,
గ్నూ/లినక్స్,
డెబియన్,
లినక్స్,
telugu linux,
telugulinux
2, ఫిబ్రవరి 2011, బుధవారం
కీబోర్డులు, ఫోనెటిక్లు, ఇన్స్క్రిప్టులు, స్కిమ్ములు, ఐబస్సులు, ఇంతేనా?
నిన్న పంచరంగి అనే కన్నడ సినిమా చూస్తున్నా. అందులో హీరో గారు ఎప్పుడూ తన చుట్టూ ఉండే వస్తువులను అన్నిటిని బహువచనం లో చెప్పేసి, లైఫు ఇష్టేనే (జీవితం ఇంతేనా?) అని విసుక్కుంటూ ఉంటాడు, పైగా ఇదే ఇష్యూ పై ఒక పాట కూడా!
"ಶಾಲಿವಾಹನ ಶಕೆ ಮನೆಗಳು, ಹೂವು ಮುಡಿದ ಚೌಲ್ಟ್ರಿಗಳು, ಹೆರಿಗೆ ವಾರ್ಡುಗಳು, ಸಾಂಬ್ರಾಣಿಗಳು, ರಿಬ್ಬನ್ನುಗಳು, ಮುದ್ದು ಜಡೆಗಳು, ಒದ್ದೆ ಕೊಡೆಗಳುಲೈಫು ಇಷ್ಟೇನೇ"
అదే గుర్తుకు వచ్చి పైన శీర్షిక కూడా అలానే పెట్టాను. కానీ అక్కడ హీరో లా లైఫు ఇంతేనా కాదు ! ఇన్ని విధాలా అని అనుకున్నా!!
లినక్స్ లో మీరు తెలుగులో టైప్ చెయ్యాలనుకుంటే చాలానే మార్గాలున్నాయి
ఈ-తెలుగులో ఆంగ్లంలో చూడండి
అయితే ఇక్కడ నేను మీకు కేవలం ఐబస్ మరియు పూర్తి ఇన్స్క్రిప్ట్ లేఔట్ గురించి రాస్తున్నాను!
ఐబస్:
ఇది చాలా సులువైన పద్ధతి.
System >> Preferences >> IBus Preferences
కి నావిగేట్ అయ్యి క్లిక్ చెయ్యండి.
ఆ పై మీకు ఒక మెసేజ్ బాక్స్ కనిపిస్తుంది ఈ మెసేజ్ తో:
IBus daemon is not started. Do you want to start it now?
Yes అని జవాబు ఇవ్వండి.
అలా మీరు జవాబు ఇచ్చాక
IBus has been started! If you can not use IBus, please add below lines in $HOME/.bashrc, and relogin your desktop.
export GTK_IM_MODULE=ibus
export XMODIFIERS=@im=ibus
export QT_IM_MODULE=ibus
అని కనిపిస్తుంది. ఏమీ ఖంగారు పడొద్దు! నేను చాలా మార్లు .bashrc లో ఆ లైన్లు పెట్టినా, నాకు ఏ మార్పు రాలేదు
ఇక ఆ తర్వాత
మీరు మీ ఐచ్ఛికాలు ఎంచుకుని మీకు నచ్చిన తెలుగు లేదా ఇతర భాషల టైపింగు మార్గాలును ఎంచుకుని, వాటి మధ్య టాగుల్ కూడా చెయ్యవచ్చు!
ఇక ప్రతిసారీ మీరు ఐబస్ ను మొదలునుండి కాక మీకు సిస్టం రిస్టార్ట్ అయిన వెంటనే కావాలంటే, ఇలా చెయ్యండి
Go to the menu:
System >> Preferences >> Startup Applications
Click the button: Add
Name: IBus daemon
Command: /usr/bin/ibus-daemon -d
Comment: start IBus daemon when Gnome starts
మళ్ళీ నా పాత పాటే లైఫు ఇష్టేనే!
"ಶಾಲಿವಾಹನ ಶಕೆ ಮನೆಗಳು, ಹೂವು ಮುಡಿದ ಚೌಲ್ಟ್ರಿಗಳು, ಹೆರಿಗೆ ವಾರ್ಡುಗಳು, ಸಾಂಬ್ರಾಣಿಗಳು, ರಿಬ್ಬನ್ನುಗಳು, ಮುದ್ದು ಜಡೆಗಳು, ಒದ್ದೆ ಕೊಡೆಗಳುಲೈಫು ಇಷ್ಟೇನೇ"
అదే గుర్తుకు వచ్చి పైన శీర్షిక కూడా అలానే పెట్టాను. కానీ అక్కడ హీరో లా లైఫు ఇంతేనా కాదు ! ఇన్ని విధాలా అని అనుకున్నా!!
లినక్స్ లో మీరు తెలుగులో టైప్ చెయ్యాలనుకుంటే చాలానే మార్గాలున్నాయి
ఈ-తెలుగులో ఆంగ్లంలో చూడండి
అయితే ఇక్కడ నేను మీకు కేవలం ఐబస్ మరియు పూర్తి ఇన్స్క్రిప్ట్ లేఔట్ గురించి రాస్తున్నాను!
ఐబస్:
ఇది చాలా సులువైన పద్ధతి.
System >> Preferences >> IBus Preferences
కి నావిగేట్ అయ్యి క్లిక్ చెయ్యండి.
ఆ పై మీకు ఒక మెసేజ్ బాక్స్ కనిపిస్తుంది ఈ మెసేజ్ తో:
IBus daemon is not started. Do you want to start it now?
Yes అని జవాబు ఇవ్వండి.
అలా మీరు జవాబు ఇచ్చాక
IBus has been started! If you can not use IBus, please add below lines in $HOME/.bashrc, and relogin your desktop.
export GTK_IM_MODULE=ibus
export XMODIFIERS=@im=ibus
export QT_IM_MODULE=ibus
అని కనిపిస్తుంది. ఏమీ ఖంగారు పడొద్దు! నేను చాలా మార్లు .bashrc లో ఆ లైన్లు పెట్టినా, నాకు ఏ మార్పు రాలేదు
ఇక ఆ తర్వాత
మీరు మీ ఐచ్ఛికాలు ఎంచుకుని మీకు నచ్చిన తెలుగు లేదా ఇతర భాషల టైపింగు మార్గాలును ఎంచుకుని, వాటి మధ్య టాగుల్ కూడా చెయ్యవచ్చు!
ఇక ప్రతిసారీ మీరు ఐబస్ ను మొదలునుండి కాక మీకు సిస్టం రిస్టార్ట్ అయిన వెంటనే కావాలంటే, ఇలా చెయ్యండి
Go to the menu:
System >> Preferences >> Startup Applications
Click the button: Add
Name: IBus daemon
Command: /usr/bin/ibus-daemon -d
Comment: start IBus daemon when Gnome starts
సో
హైదరాబాద్ లో ఉండే వారు ని:సంకోచంగా మా వద్ద సహాయం తీస్కొనవచ్చు. మీకు వీలైనపుడు మాకు చెపితే పూర్తిగా ఉబుంటు లేక ఇతర లినక్స్ పంపకాలను మీ వద్దనే ఉచితంగా స్థాపిస్తాం. ఇతర సందేహాలున్నా చెప్పండి!
మళ్ళీ నా పాత పాటే లైఫు ఇష్టేనే!
లెబెల్స్:
అవగాహన,
ఉబుంటు,
ఐబస్,
ఓపెన్ సోర్స్,
టైపింగు,
తెలుగు టైపింగు
22, డిసెంబర్ 2010, బుధవారం
ఉబుంటు
‘ఓపెన్’ ఆప్యాయత..!
‘అంతా ఉచితం..!’ అంటే -అటు ఎగబడే వారూ ఉన్నారు..! ఇటు పోదూ బడాయి అని నవ్వేసేవారూ ఉన్నారు! కొనలేని స్థితిలో పైరసీకి సిద్ధమే కానీ, చచ్చినా ఓపెన్ సోర్సు వొద్దు బాబోయ్ ! అనేవారు సైతం ఈ చిన్ని వ్యాసం చదవండి. విండోస్ కన్నా దీటుగా ఉబుంటు అనే లినక్స్ వెర్షన్ ఉచితంగా దొరుకుతుంది. ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్లలో ప్రస్తుతానికి రెండో స్థానం ‘ఉబుంటూ’దే ! రేపో, ఎల్లుండో అది ప్రథమస్థానాన్ని ఆక్రమించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రతి ఆరు నెలలకీ దీని కొత్త వెర్షన్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. ఆటోమేటిగ్గా మీ పీసీలో అప్డేట్ చేసేసుకోవచ్చు కూడా. ప్రతీ వెర్షన్ కీ 18 నెలల సపోర్టు గ్యారంటీ.
'ఉబుంటు' పేరు వినడానికే చాలా తమాషా. అటు లినక్స్ కుటుంబం ఆదరణా, ఇటు ప్రొఫెషనల్స్ తోడ్పాటూ వెరసి ఉబుంటు లినక్స్ -ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ‘సాఫ్ట్వేర్ అనేది ఉచితంగా దొరకాలి. అందరూ వారి వారి స్థానిక భాషల్లో వాడుకోగలగాలి. యూజర్లు తాము కోరుకున్న రీతిలో కస్టమైజ్ చేసుకునే వీలుండాలి’ -ఇదీ ఉబుంటు మేనిఫెస్టో. ఇది ఏదో ఆషామాషీ భారతీయ ఎలెక్షన్ మానిఫెస్టో కాదు. సాఫ్ట్వేర్ నిపుణులు చెప్పిందే చేసి చూపించే ఆపరేటింగ్ సిస్టం.
ఇంతకీ ‘ఉబుంటు’ అనేది జులు, హాసా భాషాలకు సంబంధించిన పదం. దక్షిణ ఆఫ్రికాలో మానవీయ సంబంధాలను వ్యక్తీకరించే ఒక భావన అది. ఒకరికొకరు, పరస్పరం చూపుకునే ఆప్యాయతకు మారుపేరు ‘ఉబుంటు’! అందుకే లినక్స్ ఆపరేటింగ్ సిస్టం ఉబుంటు వచ్చింది. ఓపెన్ సోర్స్ అంటే, అంతేకదా! ఆకాశమే హద్దు. అలాంటప్పుడు ఈ వసుధైక కుటుంబాన్ని కలిపే శక్తి ‘ఉబుంటు’కే ఉందనడం అతిశయోక్తి కాదు. ఇంటెల్, ఎఎమ్డి ప్రాసెసర్ల మీదే కాదు, సన్ ఆల్ట్రా, స్పార్క్, అమెజాన్ ఇసి 2 ఆర్కిటెక్చర్లో సైతం పనిచేసేలా నేడు ఉబుంటూ దొరుకుతోంది. ప్రజాదరణతో అందరికీ చేరువవుతోంది! ఆఖరికి ఎంటర్ప్రేజ్ వెర్షన్ కూడా ఫ్రీగా లభిస్తోంది. ఇది అత్యుత్తమ ట్రాన్స్లేషన్, యాక్సెసబిలిటీ సౌకర్యాలను కలిగి ఉంది. ఉబుంటు ఇన్స్టాల్ చేసుకోవడం చాలా సులభం. అంతా 20 నిముషాల పని. ఉబుంటు 10.4 వెర్షన్ ఏప్రిల్ 2010లో అందుబాటులోకి వచ్చింది. ఉబుంటు 10.10 వెర్షన్ అక్టోబర్లో అందుబాటులోకి వచ్చింది. ఎలాంటి సాయం కావాలన్నా, ఎలాంటి డాక్యుమెంటేషన్ కావాలన్నా ఎన్నో వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి.
లెబెల్స్:
అవగాహన,
ఉబుంటు,
ఓపెన్ సోర్స్,
తెలుగు లినక్స్,
లినక్స్
27, నవంబర్ 2010, శనివారం
‘లినక్స్’ధే లోకం
‘జురాసిక్ పార్క్’ చిత్రం గుర్తుందా? అలనాడు యువతనే కాదు అన్నిరకాల ప్రేక్షకులకూ ఒక ‘కిక్’ ఇచ్చిందీ చిత్రం. దానికి కారణం అందులో వాడిన గ్రాఫిక్స్, ఆనిమేషన్‌లే. ఈ సినిమా తర్వాతే దాదాపు అన్ని చిత్రాల్లోనూ (అసరం ఉన్నా, లేకున్నా) అంతో ఇంతో గ్రాఫిక్స్ జొప్పించటం ఆరంభమైంది. అంతలా ‘సినీ’ నిర్మాణాన్నే ప్రభావితం చేసిన జురాసిక్ పార్క్ చిత్రంలోని గ్రాఫిక్స్, ఆనిమేషన్ అంతా రూపుదిద్దుకొన్నది ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ‘లినక్స్’లోని సాఫ్ట్వేర్లతోనే..! ఆశ్చర్యంగా ఉంది కదూ! నిజం!
1991లో లినస్ టోర్వాల్డ్స్ అనే ‘ఫిన్‌లాండ్’ దేశ ప్రోగ్రామర్ రూపొందించడం, ఆ తర్వాత 12 ఏళ్ళల్లో కంప్యూటర్ రంగంలో కొత్త వివాదాలకూ, వ్యాపార అవకాశాలకూ కేంద్రబిందువైంది ‘లినక్స్’. హాబీగా, సరదాగా తయారు చేసుకొన్న ఆపరేటింగ్ సిస్టం ‘లినక్స్’. నేడు ఎందరెందరినో అలరిస్తోంది. ఐబిఎం, హెచ్‌పి, ఇంటెల్ వంటి సంస్థల అండదండలతో ఎదురులేని ఆపరేటింగ్ సిస్టమ్‌గా ఎదిగింది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఒక్కసారిగా 2వేల దశకంలో వెలుగులోకి వచ్చి ప్రాచుర్యాన్ని పొందడానికి కారణాలు బోలెడు. ఆర్థికరంగ పరిస్థితితో అప్పటికే వివిధ సంస్థలు నష్టాల ఊబిలో కూరుకు పోవడంతో ఖర్చులు తగ్గించుకొని లాభాల బాటలో పయనించాలంటే ‘ఓపెన్ సోర్స్ గతి’ అని భావించారు. దాంతోబాటు ఆపరేటింగ్ సిస్టం, సాఫ్ట్వేర్స్ వీటిపై బడ్జెట్ ఖర్చులను తగ్గించుకోవాలని వివిధ కార్యాలయాలూ, కార్పొరేట్ సంస్థలూ ‘లినక్స్’ వైపే మొగ్గు చూపనారంభిచాయి. ఇంటెల్ సంస్థ కూడా ‘లినక్స్’కు ఉన్న సత్తాను గుర్తించి దాన్ని సపోర్టు చేసే రీతిలో ప్రొఫెసర్లను తయారు చేయడం ద్వారా సపోర్టు నివ్వడంతో ‘లినక్స్’ ఎదగుదల సాధ్యమైంది. ఫెడోరా, రెడ్‌హేట్, ఓపెన్ స్యూజ్, ఉబుంటు వంటి సంస్థలు ‘లినక్స్’ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నాయి. వీటిపై సమగ్రమైన డాక్యుమెంటేషన్, ఆపరేషన్స్, డౌన్‌లోడింగ్ సౌకర్యాలు ఇప్పటికీ వారివారి వెబ్ సైట్లలో లభ్యమే. ఎందుచేతనో రెడ్‌హేట్ సంస్థ ఇటీవల ధోరణి మార్చి కొంత వ్యాపారాత్మక వ్యూహాన్ని అనుసరించడంవల్ల ‘ఫ్రీ’ సర్వీసులు పరిమితమైపోయాయి. నేడు సర్వత్రా ఉబుంటు లినక్స్ బాగా ప్రాచుర్యంలోకి వస్తోంది. లినక్స్‌మీద ఫోరమ్స్‌లో కూడా చర్చించుకున్నారంతా. లినక్స్‌కు అలనాడు అందర్నీ అలరించిన యునిక్స్ ఆపరేటింగ్ సిస్టం మూలమనే విషయాన్ని గమనించాలి! యునిక్స్ అలనాడు ఆసియా దేశాల్లో, ముఖ్యంగా ఇండియాలో బాగా వాడేవారు కూడా. మెయిన్ ఫ్రేమ్‌లలో కూడా యునిక్స్, దాని రూపాంతరాలూ కొన్ని లభ్యమయ్యేవి. చక్కగా పనిచేయడం, వైరస్‌ల గోల లేకుండా ఉండటం, ఎప్పటిపకప్పడు తాజా అప్‌డేట్స్ నెట్‌లో దొరుకుతుండటం, అన్నిటినీ మించి సమస్యలు తక్కువగా ఉంటూ, ఉచితంగా లభించడం ‘లినక్స్’ విజయ రహస్యం.
వనరు: ఆంధ్రభూమి
వనరు: ఆంధ్రభూమి
లినక్స్ మీద మరింత సమాచారం కోసం ఈ లంకెలను దర్శించండి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)









