ఓపెన్ సోర్స్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఓపెన్ సోర్స్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, ఫిబ్రవరి 2011, బుధవారం

కీబోర్డులు, ఫోనెటిక్లు, ఇన్స్క్రిప్టులు, స్కిమ్ములు, ఐబస్సులు, ఇంతేనా?

నిన్న పంచరంగి అనే కన్నడ సినిమా చూస్తున్నా. అందులో హీరో గారు ఎప్పుడూ తన చుట్టూ ఉండే వస్తువులను అన్నిటిని బహువచనం లో చెప్పేసి, లైఫు ఇష్టేనే (జీవితం ఇంతేనా?) అని విసుక్కుంటూ ఉంటాడు, పైగా ఇదే ఇష్యూ పై ఒక పాట కూడా!
"ಶಾಲಿವಾಹನ ಶಕೆ ಮನೆಗಳು, ಹೂವು ಮುಡಿದ ಚೌಲ್ಟ್ರಿಗಳು, ಹೆರಿಗೆ ವಾರ್ಡುಗಳು, ಸಾಂಬ್ರಾಣಿಗಳು, ರಿಬ್ಬನ್ನುಗಳು, ಮುದ್ದು ಜಡೆಗಳು, ಒದ್ದೆ ಕೊಡೆಗಳುಲೈಫು ಇಷ್ಟೇನೇ"
అదే గుర్తుకు వచ్చి పైన శీర్షిక కూడా అలానే పెట్టాను. కానీ అక్కడ హీరో లా లైఫు ఇంతేనా కాదు ! ఇన్ని విధాలా అని అనుకున్నా!!
లినక్స్ లో మీరు తెలుగులో టైప్ చెయ్యాలనుకుంటే చాలానే మార్గాలున్నాయి 
ఈ-తెలుగులో ఆంగ్లంలో చూడండి 
అయితే ఇక్కడ నేను మీకు కేవలం ఐబస్ మరియు పూర్తి ఇన్స్క్రిప్ట్ లేఔట్ గురించి రాస్తున్నాను!


ఐబస్:
ఇది చాలా సులువైన పద్ధతి.
System >> Preferences >> IBus Preferences
కి నావిగేట్ అయ్యి క్లిక్ చెయ్యండి.




ఆ పై మీకు ఒక మెసేజ్ బాక్స్ కనిపిస్తుంది ఈ మెసేజ్ తో:


IBus daemon is not started. Do you want to start it now?
Yes  అని జవాబు ఇవ్వండి.


అలా మీరు జవాబు ఇచ్చాక


IBus has been started! If you can not use IBus, please add below lines in $HOME/.bashrc, and relogin your desktop.
export GTK_IM_MODULE=ibus
export XMODIFIERS=@im=ibus
export QT_IM_MODULE=ibus



అని కనిపిస్తుంది. ఏమీ ఖంగారు పడొద్దు! నేను చాలా మార్లు .bashrc లో ఆ లైన్లు పెట్టినా, నాకు ఏ మార్పు రాలేదు
ఇక ఆ తర్వాత 


మీరు మీ ఐచ్ఛికాలు ఎంచుకుని మీకు నచ్చిన తెలుగు లేదా ఇతర భాషల టైపింగు మార్గాలును ఎంచుకుని, వాటి మధ్య టాగుల్ కూడా చెయ్యవచ్చు!


ఇక ప్రతిసారీ మీరు ఐబస్ ను మొదలునుండి కాక మీకు సిస్టం రిస్టార్ట్ అయిన వెంటనే కావాలంటే, ఇలా చెయ్యండి


Go to the menu:
System >> Preferences >> Startup Applications
Click the button: Add
Name: IBus daemon
Command: /usr/bin/ibus-daemon -d
Comment: start IBus daemon when Gnome starts



సో 
హైదరాబాద్ లో ఉండే వారు ని:సంకోచంగా మా వద్ద సహాయం తీస్కొనవచ్చు. మీకు వీలైనపుడు మాకు చెపితే పూర్తిగా ఉబుంటు లేక ఇతర లినక్స్ పంపకాలను మీ వద్దనే ఉచితంగా స్థాపిస్తాం. ఇతర సందేహాలున్నా చెప్పండి!


మళ్ళీ నా పాత పాటే లైఫు ఇష్టేనే!

22, డిసెంబర్ 2010, బుధవారం

ఉబుంటు

 
ఓపెన్ఆప్యాయత..!
అంతా ఉచితం..!’ అంటే -అటు ఎగబడే వారూ ఉన్నారు..! ఇటు పోదూ బడాయి అని నవ్వేసేవారూ ఉన్నారు! కొనలేని స్థితిలో పైరసీకి సిద్ధమే కానీ, చచ్చినా ఓపెన్ సోర్సు వొద్దు బాబోయ్ ! అనేవారు సైతం ఈ చిన్ని వ్యాసం చదవండి. విండోస్ కన్నా దీటుగా ఉబుంటు అనే లినక్స్ వెర్షన్ ఉచితంగా దొరుకుతుంది. ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్లలో ప్రస్తుతానికి రెండో స్థానంఉబుంటూదే ! రేపో, ఎల్లుండో అది ప్రథమస్థానాన్ని ఆక్రమించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రతి ఆరు నెలలకీ దీని కొత్త వెర్షన్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. ఆటోమేటిగ్గా మీ పీసీలో అప్డేట్ చేసేసుకోవచ్చు కూడా. ప్రతీ వెర్షన్ కీ 18 నెలల సపోర్టు గ్యారంటీ.‌‌‌‌

'ఉబుంటు' పేరు వినడానికే చాలా తమాషా. అటు లినక్స్ కుటుంబం ఆదరణా, ఇటు ప్రొఫెషనల్స్ తోడ్పాటూ వెరసి ఉబుంటు లినక్స్ -ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ‘సాఫ్ట్వేర్ అనేది ఉచితంగా దొరకాలి. అందరూ వారి వారి స్థానిక భాషల్లో వాడుకోగలగాలి. యూజర్లు తాము కోరుకున్న రీతిలో కస్టమైజ్ చేసుకునే వీలుండాలి’ -ఇదీ ఉబుంటు మేనిఫెస్టో. ఇది ఏదో ఆషామాషీ భారతీయ ఎలెక్షన్ మానిఫెస్టో కాదు. సాఫ్ట్వేర్ నిపుణులు చెప్పిందే చేసి చూపించే ఆపరేటింగ్ సిస్టం.
ఇంతకీఉబుంటుఅనేది జులు, హాసా భాషాలకు సంబంధించిన పదం. దక్షిణ ఆఫ్రికాలో మానవీయ సంబంధాలను వ్యక్తీకరించే ఒక భావన అది. ఒకరికొకరు, పరస్పరం చూపుకునే ఆప్యాయతకు మారుపేరుఉబుంటు’! అందుకే లినక్స్ ఆపరేటింగ్ సిస్టం ఉబుంటు వచ్చింది. ఓపెన్ సోర్స్ అంటే, అంతేకదా! ఆకాశమే హద్దు. అలాంటప్పుడు ఈ వసుధైక కుటుంబాన్ని కలిపే శక్తిఉబుంటుకే ఉందనడం అతిశయోక్తి కాదు. ఇంటెల్, ఎఎమ్డి ప్రాసెసర్ల మీదే కాదు, సన్ ఆల్ట్రా, స్పార్క్, అమెజాన్ ఇసి 2 ఆర్కిటెక్చర్లో సైతం పనిచేసేలా నేడు ఉబుంటూ దొరుకుతోంది. ప్రజాదరణతో అందరికీ చేరువవుతోంది! ఆఖరికి ఎంటర్ప్రేజ్ వెర్షన్ కూడా ఫ్రీగా లభిస్తోంది. ఇది అత్యుత్తమ ట్రాన్స్లేషన్, యాక్సెసబిలిటీ సౌకర్యాలను కలిగి ఉంది. ఉబుంటు ఇన్స్టాల్ చేసుకోవడం చాలా సులభం. అంతా 20 నిముషాల పని. ఉబుంటు 10.4 వెర్షన్ ఏప్రిల్ 2010లో అందుబాటులోకి వచ్చింది. ఉబుంటు 10.10 వెర్షన్ అక్టోబర్లో అందుబాటులోకి వచ్చింది. ఎలాంటి సాయం కావాలన్నా, ఎలాంటి డాక్యుమెంటేషన్ కావాలన్నా ఎన్నో వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి.

17, నవంబర్ 2010, బుధవారం

ఓపెన్ సోర్సే బెటర్



నేడు కంప్యూటర్ లేనిదే క్షణమైనా గడవటం లేదు. పాతకాలంలో ఒక వాల్వు రేడియో కొంటే దాన్ని పదికాలాలపాటు వాడేవారు. ఆధునిక ప్రపపంచంలో ఆ పరిస్థితి లేదు. అంతా ఆరునెల్లే. ప్రతిరోజూ కొత్త పరిజ్ఞానం మార్కెట్‌లోకి వస్తోంది. ఇది సాఫ్ట్వేర్‌కూ మినహాయింపేమీ కాదు. వేలకు వేలు పోసి ఒక సాఫ్ట్వేర్ కొంటే, దానికి మరో వెర్షన్ ఆరు నెలల్లో ప్రత్యక్షం. మనం కొత్త సాఫ్ట్వేర్ను వాడకపోతే ఔట్‌డేట్ అయిపోయినట్టే. దీనివల్లే హెచ్చుశాతం ప్రజలు ‘పైరసీ’కి దోహదపడుతున్నారు. సాఫ్ట్వేర్ కాపీ చేసి వాడటం తప్పేకాదు. నేరం కూడా! మరిదీనికి పరిష్కారం లేదా? అంటే ఉంది. అదే ‘ఓపెన్ సోర్స్’. అంటే అంతా బహిరంగంగానే లభించడం. అదీ ఉచితంగా. దానికి సోర్స్ కోడ్ కూడా లభిస్తుంది. కేవలం మనం ఒక సాఫ్ట్వేర్ను వాడటమే కాక, కావలిస్తే దానికి మరిన్ని ఫీచర్లు జోడించడమో, ఉన్న సమస్యను పరిష్కరించడమో చేసి, దానిని తిరిగి అందరికీ అందుబాటులో తేగల్గడం ‘ఓపెన్ సోర్స్’ ప్రత్యేకత. వాణిజ్యపరంగా లభించే ఆఫీస్ సూట్‌ల నుంచీ ఫోటోలు ఎడిటింగ్, ప్రజంటేషన్ సాప్ట్వేర్లే కాదు, ఆపరేటింగ్ సిస్టమ్‌లూ, డేటాబేస్ సిస్టమ్‌లూ- ఏ రకమైన సాఫ్ట్వేర్ అయినా సరే! ఓపెన్ సోర్స్ ప్రత్యామ్నాయం వుంది. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ను వాడుకోవడానికి ఎలాంటి పరిమితులూ, పర్మిషన్లూ అక్కర్లేదు. 1983లో రిచర్డ్స్ మాథ్యూస్ స్టాల్‌మాన్ ఆరంభించిన ఫ్రీ సాఫ్ట్‌వేర్ స్ఫూర్తితో 1998లో ఓపెన్ సోర్స్ ఉద్యమ రీతిలో వెలుగులోకి వచ్చింది. 1999లో ‘స్టార్ ఆఫీస్’ పేరుతో అమ్మకాలు సాగించిన సన్‌మైక్రో సంస్థ దానిని ఉచితంగా, ఓపెన్ సోర్స్ కింద ఓపెన్ ఆఫీస్, ఓఆర్‌జి పేరుతో అందుబాటులోకి తేవడంతో ఊపునందుకొంది. స్పెయిన్ లాంటి దేశాల్లో ఓపెన్ సోర్స్, ఫ్రీ సాఫ్ట్వేర్ల ఆధారంగా శిక్షణనివ్వడమే కాదు, ఆయా సాఫ్ట్వేర్లను ఈ-గవర్నెన్స్ చొరవల్లో వాడుతున్నారు. భారతదేశంలో ఇప్పుడిప్పుడే చైతన్యం వస్తోంది. ముఖ్యంగా కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ వాడటం మొదలైంది.
ఓపెన్ సోర్స్
సాఫ్ట్వేర్లను అన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ శాఖలూ వాడి ఈ-గవర్నన్స్ అమలు చేస్తే, ఆర్థికంగా, ఎంతో లబ్ధి చేకూరుస్తుందనడంలో సందేహం లేదు. ఓపెన్ సోర్స్, ఫ్రీ సాఫ్ట్వేర్లు అటు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోనూ, ఇటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోనూ కూడా పనిచేసేలా దొరుకుతాయి. ఆఫీస్ సూట్స్, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, హెచ్‌టిఎంఎల్ ఎడిటర్స్, టెక్స్ ఎడిటర్స్, ఫోటో ఎడిటర్స్, యానిమేషన్ టూల్స్, ఈ-మెయిల్ క్లయింట్స్, ఇంటర్నెట్ బ్రౌజర్స్, ఎఫ్‌టిపీ క్లయింట్స్, వెబ్ సర్వర్స్, కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, ఆఖరికి యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ అప్లికేషన్లు కూడా ఎన్నెన్నో ఉన్నాయి. వైజ్ఞానిక, సాంకేతిక పరమైన సాఫ్ట్వేర్లూ ఉన్నాయి. ఆడియో, వీడియో సాఫ్ట్వేర్ల గురించి చెప్పనక్కర్లేదు. ఇఆర్‌పి, క్యాడ్, క్యామ్ రంగాల్లో కూడా ఎన్నోసాఫ్ట్వేర్లూ ఉన్నాయి.
మన ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టులన్నీ ఓపెన్ సోర్స్ ఆధారంగా రూపొందితే కొన్నివేల కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవుతుంది. దానిని ప్రజా సంక్షేమానికి వాడొచ్చు. ఈ రీతిలో మన మేథావులూ, ప్రభుత్వాలూ ఆలోచిస్తే ఎంత బావుంటుందో! కదా!

ఓపెన్ సోర్సు... అపోహలేల...?

ఏదన్నా సరే ఫ్రీ అంటే ఇట్టే ఎగరేసుకుపోయే వారూ ఉన్నారు. ఉచితం! అంటే లోకువ కట్టేసే వారూ లేకపోలేదు. ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌లను ఇట్టే ఎగరేసుకుపోకుండా అపోహలు సృష్టించేవారే అధికం! ముఖ్యంగా యూజర్స్‌కీ, కస్టమర్స్‌కీ ఉండే పరిజ్ఞాన, విజ్ఞాన సమాచారాలు తక్కువ. ఈ బలహీనతను ఆసరా చేసుకుని కొన్ని వ్యాపార సంస్థలు ఓపెన్ సోర్సు గురించి వ్యతిరేక భావనలు కల్పించడంలో సక్సెస్ అవుతున్నారు. అందువల్ల ఓపెన్ సోర్స్ గురించిన అపోహలు తొలగించుకోవాల్సిన అవసరం మనకెంతో ఉంది.
ఐటి రంగంలో ఓపెన్ సోర్సుకి స్థానం లేదు. కేవలం నేర్చుకోవడానికి విద్యార్థులు కళాశాల గదులకే పరిమితం- అని చాలామంది అంటుంటారు. అది శుద్ధ తప్పు. నేడు ఓపెన్ సోర్సు సాఫ్ట్‌వేర్‌లైన లినక్స్, అపాచి వెబ్ సర్వర్, జావా లాంగ్వేజ్- ఇలాంటివెన్నో ఐటి రంగంలో విస్తృతంగా వాడుతున్నారు.
కీలకమైన (మిషన్ క్రిటికల్) ఈ-గవర్నెన్స్ అప్లికేషన్స్‌కు పనికిరాదనీ ఒక అపోహ ఉంది. నేడు ఎన్నో దేశాల్లో ఈ-గవర్నెన్స్ అప్లికేషన్లు ఓపెన్ సోర్స్ నుంచి వాడటంవల్ల కోట్లాది రూపాయలను ఆదా చేసుకుంటున్నాయి. ఓపెన్ సోర్స్ సంస్థలకు స్వతహాగా వారి మేధోవాక్కులు ఉండవు -ఇదీ అపోహే. ప్రొప్రయిటరీ సాఫ్ట్‌వేర్ సంస్థలకు కాపీరైట్ హక్కులెలా ఉంటాయో, ఓపెన్ సోర్స్ సంస్థలకూ ఉంటాయి. వాణిజ్యపరమైన సంస్థల్లా, ఓపెన్ సోర్స్ సంస్థలు నియంతృత్వ ధోరణిని అవలంబించవు. ఓపెన్ సోర్స్ పరిజ్ఞానం ప్రొప్రయిటరీ టైపు సపోర్టునివ్వదు -ఇదీ అపోహే. కస్టమర్ సపోర్టు పేరున డబ్బులు వసూలు చేసి సపోర్టునిచ్చేవి వ్యాపార సంస్థలు. నిజానికి ఓపెన్‌సోర్స్‌లో లభిస్తున్నంత చక్కని డాక్యుమెంటేషన్, ప్రొఫెషనల్ సపోర్ట్, మరే వాణిజ్యపరమైన సాఫ్ట్‌వేరూ ఇవ్వడం లేదు. ఓపెన్ సోర్సులో నియంత్రణ లేదు. ఎవరైనా మార్చొచ్చు. ఇది ఓపెన్ సోర్స్ అంటే తెలీనివారు చేసే ప్రచారం. ఎలాపడితే అలా సోర్సుకోడ్‌ను మార్చడానికి వీలులేదు. ఎలాంటి కోడ్ మార్పులు జరిగినా, అవి కేవలం ‘బగ్’ (ఎర్రర్) తొలగింపునకు చెందినదే ఉంటాయి. ఓపెన్‌సోర్స్ సేఫ్ కాదని అందరూ అంటుంటారు. ఓపెన్‌సోర్స్ కోడ్ అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి హ్యాకర్లు సులభంగా హ్యాక్ చేసేస్తారనేది కేవలం అపోహే. ఓపెన్ సోర్స్ ప్రమాణాలు ఉన్నతమైనవీ, సురక్షతమైనవీను!

వనరు: ఆంధ్రభూమి

24, సెప్టెంబర్ 2010, శుక్రవారం

ఉచిత సాఫ్ట్వేర్ ఉద్యమం మరియు దాని చరిత్ర



ఉచిత సాఫ్ట్వేర్ గురించి చెప్పే ముందు మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైనది ఏమిటంటే అసలు సాఫ్ట్వేర్ అంటే ఏమిటి..?
 
కంప్యూటర్ సాఫ్ట్వేర్ లేదా సాఫ్ట్వేర్ అంటే కంపూటర్ ఏమి చెయ్యాలో తెలిపే కంప్యూటర్ కి సంబందించిన ప్రోగ్రాంల సమూహాన్ని కలిపి సాఫ్ట్వేర్ అంటారు.ఈ ప్రోగ్రాం లలో ఆదేశాలు, ఆజ్ఞలు వరుస క్రమంలో పేర్చబడి ఉంటాయి.
 
ఉచిత సాఫ్ట్వేర్ అనేది కూడా సాఫ్ట్వేరే కాకపోతే దీని పంపకం అనేది ఎలా ఉంటుందంటే దీనిని ఏ పనికైనా ఉపయోగించే సౌకర్యం మనకి కల్పిస్తుంది.అంటే ఉచిత సాఫ్ట్వేర్ ని మీరు నకలు తీసి పంచవచ్చు,సోర్సు కోడ్ ను క్షున్నంగా పరిశీలించవచ్చు, సవరించవచ్చు కూడా.ఉచిత సాఫ్ట్వేర్(ఫ్రీ సాఫ్ట్వేర్) అనే పదాన్ని 1983 లో తీసుకొని దాని ఉద్దేశ్యాన్ని,దిశా నిర్దేశాన్ని సూచించారు.అందులో 'ఉచిత' అనేది ఉచితంగా వచ్చే దాని కంటే మరింత స్వేచ్చను వాడుకరులకు ఇచ్చేదిగా ఉండాలి అని పేర్కొన్నారు.ఫ్రీ సాఫ్ట్వేర్ కు గత్యంతరముగా 'సాఫ్ట్వేర్ లిబరే' మరియు 'ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్' [FOSS] లను కూడా చేర్చారు.
ఉచిత సాఫ్ట్వేర్ ఉద్యమం [Free Software Movement] 1983 లో ప్రారంభమయ్యింది, దీని లక్ష్యం ఒక్కటే అధినాయకత్వ సాఫ్ట్వేర్ [proprietary software]లకు బదులుగా [replacement] ఉచిత సాఫ్ట్వేర్ ను రూపొందించడమే.అదే సంవత్సరం ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ ను[fsf.org] కూడా స్థాపించారు.అధినాయకత్వ సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందంటే ఆ సాఫ్ట్వేర్ చట్టపరమైన హక్కులన్నీ అధినేతకి చెందడమే కాకుండా, సాఫ్ట్వేర్ ని కొన్నవారుకి సాఫ్ట్వేర్ కొన్ని వినియోగ నిబంధనలతో, ఇతర వినియోగాన్ని [నకలు తీయడం,సవరించటం] నిషేదిస్తూ సాఫ్ట్వేర్ ను ఇస్తారు.
ఈ ఉద్యమం నుండి పుట్టినవే గ్నూ, ది లినక్స్ కెర్నల్, మొజిల్లా ఫైరుఫాక్సు, ఓపెన్ ఆఫీస్ సాఫ్ట్వేర్ స్యూట్, ఇతర నెట్వర్క్ సెర్వర్స్, ఫ్రీ బిఎస్డి, సాంబ మరియు అపాచి.  
ఉచిత సాఫ్ట్వేర్ ఉద్యమమే లేకుంటే ఒక ఉబుంటు కానీ ఫైరుఫాక్సు కానీ ఓపెన్ ఆఫీసు, విఎల్సి మీడియా ప్లేయర్..లను ఊహించగలరా..?