నా గురించి


హాయ్, నా పేరు ప్రవీణ్, నేను ప్రస్తుతం లినక్స్ మరియు ఫ్రీ సాఫ్ట్వేర్ వినియోగిస్తూ, అందరికీ వీటిని ఎలా వాడాలో మరియు ఎందుకు వాడాలో వాటి ఆవశ్యకతను తెలిపే ప్రయత్నం చేస్తుంటాను.ఈ ఆధునిక యుగంలో అన్నీ పనులూ కంప్యూటరుతో ముడిపడివుంటున్నాయి. కాబట్టి ప్రతీ ఒక్కరూ కంప్యూటరు పై అవగాహన మరియు పరిజ్ఙానాన్ని కలిగివుండాలని అనుకుంటాను. ఇందుకోసం తెలుగులో కూడా కంప్యూటరును వాడుకోగలగాలి. తెలుగు స్థానికీకరణలో నా వంతు పాత్రను నిర్వహిస్తున్నాను. ప్రపంచంలో ఎవరికైనా మాతృ భాష తప్పనిసరిగా వచ్చివుంటుంది కాబట్టి మాతృ భాషలో అన్నీ సౌలభ్యంగా వుంటే అభివృద్ధి ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడుతున్నాను. తెలుగు భాష మరుగునపడుతున్న తరుణంలో దీనిని అంతర్జాలంలో కూడా వినియోగించుటకు ఎంతో కృషిచేయాల్సివుంది.

ప్రస్తుతం పలు స్వేచ్ఛాయుత పరియోజనలకు భాష నిర్వాహకుడిగా ఉన్నాను. నేను నిర్వహిస్తున్న కొన్ని పరియోజనలు.
  • లాంచ్పాడ్ తెలుగు జట్టు
  • గింప్ (గ్నూ ఇమేజ్ మానిప్యులేషన్ ప్రోగ్రామ్)
  • వియల్సీ మాధ్యమ ప్రదర్శకం
  • బన్షీ మాధ్యమ ప్రదర్శకం
  • రిథమ్‌బాక్స మాధ్యమ ప్రదర్శకం
  • షాట్‌వెల్ చాయాచిత్ర నిర్వాహకం
  • జికాంప్రిస్
  • సినాప్టిక్ ప్యాకేజీ నిర్వాహకం
  • డ్యుడ్యులినక్స్
  • జిట్రాన్సులేటర్
  • ఎల్ఎక్స్ డియి
  • ఎక్స్ఎఫ్‌సియి
  • ఫెడోరా వెబ్‌సైటు
  • జిపార్టెడ్
  • పిటివి
  • నాటిలస్
  • గ్నోమ్-షెల్
  • ఉబుంటు సాఫ్టువేర్ సెంటర్
  • ఓపెన్‌షాట్ వీడియో ఎడిటర్
  • ఫైల్-రోలర్
  • ఎవిన్స్
  • eog
  • గ్నోమ్ టెర్మినల్