టోటెమ్ లేదా వీయల్సీ మాధ్యమ ప్రదర్శకాలతో విసిగిపోయారా....సరికొత్త
వీడియో ప్లేయర్‌ని కోరుకుంటున్నారా..? అయితే మీ కోసం సరికొత్త ఆధునిక
దృశ్యక ప్రదర్శకం వచ్చేసింది. అదే ఆడియెన్స్ దృశ్య ప్రదర్శకం. సరికొత్త
రూపంతో, అలరించే రీతిలో ఆడియెన్స్ ప్లేయర్‌ని రూపొందించారు. ఇది వాలా
ప్రోగ్రమింగ్ భాషలో వ్రాయబడింది. క్లట్టర్ ఆధారిత వాడుకరి అంతరవర్తితో
ఉంటుంది. ఈ ప్రదర్శకంలోని నియంత్రణలు అన్నీ అపారదర్శకతతో మృదువుగా ఉంటాయి.
దృశ్యకంలో ముందుకు కొనసాగుటకు సీక్‌బార్‌పై మౌసు సూచికను ఉంచినట్లయితే ఆ
స్థానంలో ఉన్న దృశ్యాన్ని చిరుచిత్రంగా చూపుతుంది.
ఈ ప్రదర్శకం ఇంకా ప్రయోగదశలోనే ఉన్నది అయినప్పటికీ అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందనటంలో సందేహంలేదు.
ఇందులో ఎటువంటి శబ్ద నియంత్రకం లేదు, వ్యవస్థ శబ్దస్థాయి ఎంతవుంటే అంతే శబ్దం వస్తుంది.
ఉబుంటు వాడుకరులు
sudo add-apt-repository ppa:audience-members/ppa
sudo apt-get update
sudo apt-get install audience
ఇతర పంపిణీలలో స్థాపించుటకు ఇక్కడి నుండి మూలాన్ని దింపుకుని, సంకలనం చేసుకోండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి