సాధారణంగా గ్నోమ్‌లో వ్యవస్థను మూసివేయుటకు నేరుగా మూసివేసే (ష్యట్‌డౌన్) బటన్ ఉండేది. కానీ ఆ తరువాత విడుదలైన గ్నోమ్ షెల్‌లో అటువంటి బటన్ ఏమీ కనిపించదు. కేవలం నిష్క్రమించు (లాగౌట్) మరియు తాత్కాలికంగా మూసివేయి (సస్పెండ్) ఐచ్ఛికాలు మాత్రమే కనిపిస్తాయి. గ్నోమ్ షెల్ వాడే చాలా మందికి తమ వ్యవస్థను నేరుగా మూసివేయడం తెలియక ముందుగా లాగౌట్ అయ్యి లాగిన్ మెనూ నుండి ష్యట్‌డౌన్ అవుతారు. అసలు విషయం ఏమిటంటే మీరు ఆల్ట్ బటన్ ఒత్తి పట్టుకుంటే సస్పెండ్ ఐచ్ఛికం కాస్తా విద్యుత్ ఆపు(పవర్ ఆఫ్)గా మారుతుంది.
ప్రతీసారీ ఆల్ట్ నొక్కనవసరం లేకుండా ఈ ఐచ్ఛికాన్ని గ్నోమ్ షెల్ పొడిగింత ద్వారా మార్చుకోవచ్చు. ఈ పొడిగింతను స్థాపించుకోండి. గ్నోమ్ షెల్ పొడిగింతల గురించి తెలుసుకోవాలంటే దిగువ ఇవ్వబడిన లంకెను సందర్శించండి.
గ్నోమ్ షెల్ పొడిగింతలు
గ్నోమ్ తదుపరి విడుదలయిన 3.6లో మూసివేత ఐచ్ఛికాన్ని నేరుగా ఇవ్వనున్నట్లు సమాచారం. నిజానికి ఈ టపాను ఏడాది క్రిందటే పోస్టు చేయవలసింది తీరికలేకపోవడం వలన ఆలస్యమైంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి