ఉబుంటు స్థాపించిన తరువాత వ్యవస్థనంతటినీ మనకు కావలసిన విధంగా
మలుచుకోవాల్సివుంటుంది. ఇందుకు కొన్ని కొత్త అనువర్తనాలను, ప్యాకేజీలను
స్థాపించాలి. ఉబుంటు 12.04 స్థాపించిన తరువాత వ్యవస్థలో ఉన్న నవీకరణ
నిర్వాహకం (అప్డేట్ మ్యానేజర్) ద్వారా నవీకరణలు ఏమైనా అందుబాటులో ఉన్నాయేమో
పరిశీలించి వాటిని స్థాపించిన తరువాత క్రింది పేర్కొన్న ప్యాకేజీలను,
అనువర్తనాలను స్థాపించడం మంచిది.
కోడెక్‌లను మరియు ఇతరాలను స్థాపించండి
ఉబుంటులో పాటలు వినటానికి లేక చలనచిత్రాలు చూడాలంటే అందుకు కావలసిన
కొడెక్లను మీరు స్థాపించాలి. న్యాయపరమైన కారణాల దృష్ట్యా ఉబుంటు ఈ
కొడెక్లను అప్రమేయంగా అందించుటలేదు. MP3, DVD, Flash, Quicktime, WMA
మరియు WMV,వంటి దస్త్రాలను ప్రదర్శించుటకు, అలాగే RAR దస్త్రాలను
తెరుచుటకు, మైక్రోసాఫ్టు కోర్ ఫాంట్స్, ఫైర్ఫాక్స్ అడోబ్ ఫ్లాష్ చొప్పింత
కొరకు క్రింద పేర్కొన్న ప్యాకేజీని స్థాపించాలి.
sudo apt-get install ubuntu-restricted-extras
జిడెబి మరియు సినాప్టిక్ మ్యానేజర్
.deb ప్యాకేజీలను స్థాపించుటకు అంతరవర్తితో కూడిన జిడెబి మరియు సినాప్టిక్ నిర్వాహకాలను స్థాపించండి.
sudo apt-get install gdebi
sudo apt-get install synaptic
గూగుల్ క్రోమ్ విహారిణిని స్థాపించండి
అడోబ్ వారు లినక్సుకు ఫ్లాష్ ప్లేయర్ మద్దతును ఫ్లాష్ ప్లేయర్ ప్లగిన్
ద్వారా అందిస్తున్నారు. కాకపోతే ఈ ప్లగిన్‌కు ఇక ముందు ఎటువంటి మద్ధతును
అందించమని పేర్కొన్నారు. గూగుల్ వారు క్రోమ్ విహారిణిలో అప్రమేయంగా పెప్పర్
ఎపిఐతో ఫ్లాష్ తోట్పాటును ఏర్పాటుచేసారు. అందువలన మీరు ఎటువంటి లోపాలను
లేని స్థిరమైన ఫ్లాష్ మద్ధతు కావాలంటే గూగుల్ క్రోమ్ ఎంచుకోవాల్సివుంటుంది.
http://google.com/chrome
ఫ్లాష్ చొప్పింతను స్థాపించండి
sudo apt-get install flashplugin-installer
యునిటీ ప్రత్యామ్నాయాలు
ఉబుంటు 12.04 ప్రిసైజ్ ప్యాంగోలిన్‌లో యునిటీ అంతరవర్తి అప్రమేయంగా
ఉంటుంది. ఒకవేళ మీకు యునిటీ నచ్చకపోయినట్లయితే, గ్నోమ్ క్లాసిక్ లేదా
గ్నోమ్ షెల్ వాడవచ్చును.
క్లాసిక్ గ్నోమ్ సెషన్
sudo apt-get install gnome-session-fallback
గ్నోమ్ షెల్
sudo apt-get install gnome-shell
ఐబస్
తెలుగులో టంకించుటకు ఆపిల్,
ఇన్‌స్క్రిప్ట్, ఆర్టియస్, పోతన మరియు ఐట్రాన్స్ వంటి వివిధ రకాల కీబోర్డు
నమూనా(అమరిక)లు అందుబాటులో ఉన్నాయి. ఇందుకు ఐబస్ తో పాటుగా ibus-m17n ప్యాకేజీని స్థాపించాల్సివుంటుంది. ఒకవేళ మీరు ఇన్‌స్క్రిప్ట్
వినియోగించువారయితే ఐబస్ సహాయం లేకుండానే వ్యవస్థలో ఉన్న కీబోర్డు అమరికల
ద్వారా ఇన్‌స్క్రిప్ట్ అమర్చుకోవచ్చును.
sudo apt-get install ibus ibus-m17n
గ్నోమ్ ట్వీక్ టూల్
గ్నోమ్ అంతరవర్తిని మీకు కావలసిన విధంగా అనురూపించుటకు గ్నోమ్ ట్వీక్ టూల్ సహకరిస్తుంది.
sudo apt-get install gnome-tweak-tool
వీయల్సీ మాధ్యమ ప్రదర్శకం
వియల్సీ సరికొత్త రూపాంతరమయిన టూఫ్లవర్‌ను స్థాపించండి. వియల్సీ ద్వారా ఎటువంటి మాధ్యమ దస్త్రాలనైనా ప్రదర్శించవచ్చు. కాబట్టి లినక్సులో వియల్సీ మాధ్యమ ప్రదర్శకం ప్రామాణికమైన మాధ్యమ ప్రదర్శకంగా పేర్కొనవచ్చును.
sudo apt-get install vlc
అదనపు (ffmpeg, x264) మాధ్యమ ప్యాకేజీలను స్థాపించండి క్రింద పేర్కొన్న ప్యాకేజీలను దింపుకుని జిడెబి లేదా టెర్మినల్ ద్వారా స్థాపించండి.
ffmpeg
http://db.tt/Gtmz7pO0
x264
http://db.tt/bcAA2cZp
libvpx
http://db.tt/myGXyfX3
qt-fast starthttp://db.tt/fWWqJh04
12 కామెంట్లు:
Hi Pravin garu..!!
I am new to linux, I was using ubuntu10.10 today only freshly installed Ubuntu12.04, after that I have updated and then I tried to install restricted-extras, but it is showing the error as shown below..
plz help me to rectify this
-----------------------------------------------------------------------------
raja@raja-VPCEA3S1E:~$ sudo apt-get install ubuntu-restricted-extras
[sudo] password for raja:
E: Could not get lock /var/lib/dpkg/lock - open (11: Resource temporarily unavailable)
E: Unable to lock the administration directory (/var/lib/dpkg/), is another process using it?
--
Thanking you
@Raja: most likely another update process running on your system.
తెలుగు లో లినక్స్ గురించి అందిస్తున్న మీకు మొదటగా నా కృతఙతలు .
కానీ ఈ గ్రంధిక భాషను చదవడం కష్టం గా వుంది.
"అంతరవర్తిని","అనురూపించుటకు" వంటి పదాల అర్ధాలకొరకు గూగుల్ లో వెతకాల్సొస్తుంది.
దయచేసి అందరికీ అర్ధమయ్యే భాషలో రాయాలని నా కోరిక
రాజు గారు,
ఏమీలేదండీ వేరొక సినాప్టిక్, ఉబుంటు సాఫ్టువేర్ కేంద్రం, అప్డేట్ మ్యానేజర్ లేక ఇతర ప్యాకేజీలకు సంబంధించి ఏమైనా నడుస్తుంటే కేవలం ఆ ఒక్క ప్రక్రియ జరపగలదు, అందువలన ఒకేసారి రెండు ప్రక్రియలను చేయడం వీలుకాదు. ఆ సమయంలో వేరేవి నడవకుండా లాక్ చేస్తుంది. ఎందుకంటే కాన్ ఫ్లిక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి.
ఎప్పుడైనా ఆ ప్రక్రియను మూసివేసినా ఇదే సందేశం చూపిస్తే మీరు ఆ లాక్‌ను క్రింది ఆదేశం ద్వారా తీసివేయవచ్చు.
raja@raja-VPCEA3S1E:~$sudo rm /var/lib/dpkg/lock
Nenu internet kosam Reliance usb datacard teesukunnanu kani danini ubuntulo ela configure cheyalo teliyadam ledu, mikemaina teliste konchem vivarinchandi. na ubuntu version 10.11 anukunta!!!!!
ప్రవీణ్ గారు!!, born2perform గారు..!!
ధన్యవాదములు. ప్రాబ్లం సొల్వె అయ్యింది.
ఇంకో ప్రాబ్లం వచ్చింది.. :(
గ్నోం క్లాసిక్ ఇన్స్టాల్ చేసి, దానిని మార్పులు చేసేటప్పుడు, పానెల్ కుడి పక్కన చూపించే తేదీ, సౌండ్, బ్యాటరీ ఐకాన్స్ పొరపాటున డిలీట్ అయ్యింది, దానిని తిరిగి ఇన్స్టాల్ చేయడానికి విఫలయత్నం చేసాను,
ఇక్కడ మీ హెల్ప్ కోరుకుంటున్నాను.
ధన్యవాదములు
అక్బర్ గారు,
మీ స్పందన తెలిపినందుకు ధన్యవాదములు,
సాంకేతిక భాషకు అనుగుణంగా తెలుగులో సరికొత్త పదసృష్టి జరుగుతున్నది. అందువలన కొన్నిసార్లు గూగుల్ నందు వెతికినా ప్రయోజనం ఉండకపోవచ్చు. కాకపోతే వీటిని అందరికీ చేరువ చేసేలా తెలుగు లినక్స్ నిఘంటువుని త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాము. తెలుగులో లినక్స్ నందు తెలుగుకు ప్రాథానమివ్వాలి కాబట్టి ఆ పదాలు వాడుకరులకు కూడా తెలిసేలా ఉండాలి అందుకొరకు వాటిని అందరికీ పరిచయం చేయడం కోసం చేసే ప్రయత్నం. ఇక్కడ పేర్కొన్న పదాలు కొన్ని క్లిష్టంగా ఉండవచ్చు ఇకనుండి అటువంటి పదాలకు బ్రాకెట్లలో ఉంచి అందరికీ అర్థమయ్యే రీతిలో వ్రాస్తాము. అంతరవర్తి (ఇంటర్ఫేస్), అనురూపించు (కస్టమైజ్)
ఈ విధానాన్ని ప్రయత్నించండి:ముందుగా ఈ ప్యాకేజీలను స్థాపించండి.
sudo apt-get install usb-modswitch usb-modswitch-data
తరువాత క్రింద పేర్కొన్న పాఠ్యాన్ని నకలుచేసి /etc/wvdial.conf లో చేర్చండి. ఇలా చేయుటకు sudo gedit /etc/wvdial.conf అని టెర్మినల్‌లో టైపుచేయండి.
[Modem0]
Modem = /dev/ttyUSB0
Baud = 115200
SetVolume = 0
Dial Command = ATDT
Init1 = ATZ
FlowControl = Hardware (CRTSCTS)
[Dialer netconnect]
Username = your device phone number
Password = password usually the device phone number
Phone = #777
Stupid Mode = 1
Inherits = Modem0
పైన యూజర్ నేమ్ మరియు పాస్ట్ వర్డుల స్థానంలో మీ యూజర్‌నేమ్ మరియు పాస్ వర్డులతో మార్చండి.ఇప్పుడు మీ వ్యవస్థను పునఃప్రారంభించండి
టెర్మినల్‌లోకి వెళ్లి sudo wvdial netconnect ఆదేశాన్ని ప్రవేశపెట్టండి. ఈ విధంగా డయిల్ చేసి ఐపి చిరునామాను కేటాయిస్తుంది డిస్కనెక్ట్ చేయుటకు control+c నొక్కండి.
మరిన్ని పద్ధతులను ఇక్కడ చూడండి.
http://goo.gl/HqIZl
రాజ గారు,
ప్యానల్ నందు మీరు తొలగించిన ఆప్లెట్లను తిరిగి పొందుటకు alt పట్టుకుని ప్యానల్ పై మౌస్ రైట్ క్లిక్ చేసినట్లయితే మెనూ చూపిస్తుంది. అందులో add to panel ఎంచుకుని మీకు కావల్సిన ఆప్లెట్లను తిరిగి జతచేయవచ్చును.
ధన్యవాదములు ప్రవీణ్ గారు
ప్రవీణ్ గారు .తెలుగు లో మీ కృషి అబినందనియం .కానీ ఇంగ్లీష్ బాష పుణ్యామా అని తెలుగు ని కూడా ఇంగ్లీష్ లో చదివితే కానీ అర్ధం కానీ పరిస్తితి . చాల మందికి స్వచమైన తెలుగు తెలియదు . ఇంగ్లీష్ తో కూడిన తెల్గు మాత్రమె తెలుసు . కావున తెలుగు పదం పక్కన ఇంగ్లీష్ పదం కూడా ఉంచితే బాగుంటుంది అని అబిప్రాయం .
నాకు ఉబుంటు డీవీడీ కావాలి .విజయవాడ లో ఎక్కడ లబిస్తాయి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి