లినక్స్ గురించి పెద్దగా పరిచయం లేనివారు కూడా ఉబుంటు గురించి కాస్తో కూస్తో తెలుసుకుంటున్నారు.దీనికి ముఖ్య కారణాలు ఉబుంటు ఉచితం, ఆకర్షణీయమైన డెస్కుటాప్ పరిసరం మరియు ఆన్ లైన్ లో లభించే మద్ధతు కూడా ఎక్కువే.అంతేకాకుండా ఈ పంపకాన్ని నిర్వహిస్తున్న కెనానికల్ సంస్థ అందరికీ అందుబాటుల్ ఉండేలా ఉబుంటు CDలను ఉచితంగా పంపిణీచేస్తుంది. అందువలన చాలామంది ఈ ఉచిత CDని పొందుటకు ఆశక్తి చూపుతున్నారు. ప్రపంచంలో చాలా మంది ఈ విధంగా ఉచిత CDలను పొందుతున్నారు, మన రాష్ట్రంలో కూడా. కాని ఇలా పొందిన వారిలో ఎంతమంది దానిని సరిగా ఉపయోగిస్తున్నారనేది ఆలోచించవలసిన విషయం.దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. ఉదాహరణకి అంతర్జాల అనుసంధానం ఎలా ఏర్పరుచుకోవాలో తెలియకపోవడం, ఏమేమి అనువర్తనాలు ఉన్నాయో వాటిని ఎలా వాడుకోవాలో...ఇలా అనేకం ఉండవచ్చు.
ఇక విషయానికి వస్తే ఉబుంటు 11.04 నాటీ నార్వాల్ ఈ నెల 28న విడుదల కాబోతుంది. ఇప్పటికే బీటా 1 వెర్షన్ విడుదలయింది, బీటా 2 ఏప్రిల్ 14న విడుదల అవుతుంది.బీటా 2 కల్లా ఉన్న అన్ని లోపాలను, దోషాలను సరిదిద్ది ఆఖరి విడుదల చేస్తారు.
ఉబుంటు 11.04 ఎలా ఉండబోతోందో ఇక్కడ ఒకసారిచూడండి...వీడియోబంధించేటపుడుకొన్నిప్రభావాలు సరిగాబంధించలేకపోయింది దానిని రికార్డర్ తప్పిదముగా గుర్తించగలరు.
తెలుగు స్థానికీకరణ విషయానికి వస్తే నేను కొంత భాధ్యత తీసుకుని ఉన్న లోపాలను, తప్పులను సరిదిద్దాను అంతేకాకుండా ఈ సారి తెలుగువారు ఒక అడుగు ముందుకేసి తెలుగులో వాడుకోవాలనే ఉద్దేశ్యంతో కాస్త సరళీకరించాను.కొన్ని కొత్త అనువర్తనాలను మరియు అప్రమేయంగా వచ్చే అనువర్తనాలను స్థానికీకరించాను. వాడుకరి అంతరవర్తి (user interface) దాదాపు తెలుగులోనే ఉండబోతుంది. నిన్న విడుదలయిన బీటా వెర్షన్ లో మొన్నటివరకూ చేసిన అనువాదాలు ఇంకా పూర్తిగా చేర్చబడలేదు. చివరి విడుదలకల్లా ఇవి చేర్చబడతాయి.
గమనిక: తెలుగు లినక్స్ లేదా అనువర్తనాలను తెలుగులో వాడటం అనేటప్పటికీ చాలా మంది విచిత్రంగా ప్రవర్తిస్తారు. లినక్స్ తెలుగులో వాడటమంటే కేవలం తెలుగు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఇంగ్లీషు ఉండబోదని కొంతమంది అనుకుంటారు. నిజానికి ఎందులోనైనా అప్రమేయంగా ఇంగ్లీషు ఉంటుంది.దీనికి అదనంగా తెలుగు భాష కూడా అందుబాటులో ఉంటుంది. సిస్టం యొక్క వాడుకరి అంతరవర్తి (user interface) భాషను సిస్టం ప్రారంభించేటపుడే ఎంచుకోవలసి ఉంటుంది. మీ ప్రాధాన్యత బట్టి తెలుగులో కావలిస్తే తెలుగులో లేదా ఇంగ్లీషులో.
ఈసారి తెలుగు ఉబుంటు విడుదలలో చెప్పుకోదగ్గ విషయాలు
- స్థాపన ప్రక్రియను తెలుగులోనే ప్రారంభించవచ్చు.
- దాదాపు వాడుకరి అంతరవర్తి (user interface) అంతా తెలుగులోనే ఉండబోతుంది.
ఉబుంటు 11.04 లో మార్పులు-చేర్పులు
- ఉబుంటు 11.04 నాటీ నార్వాల్ లో సాధారణంగా ఎప్పుడూ ఉండే వాడుకరి అంతరవర్తి గ్నోమ్ కాకుండా ఉబుంటు వారు ప్రత్యేకంగా యునిటీ [unity] అనే దానిని రూపొందించి అభివృద్ధిచేసారు. ఇది దాదాపు కొత్తగా రాబోయే గ్నోమ్ 3(gnome 3)ను పోలి ఉంటుందనుకోండి.
- ఫ్లుయెండో MP3ప్లగిన్ ను ఉబుంటు ఉచితంగా అందిస్తున్నది.
- రిథమ్ బాక్స్ కు బదులుగా బన్‌షీ మీడియా ప్లేయర్ ను ఉండబోతుంది.
- F-spotకు బదులుగా షాట్‌వెల్ ఫొటో మానేజర్ ఉండబోతుంది.
- rar పైళ్ళకు మద్ధతు.
- సాఫ్ట్ వేర్ కేంద్రంలో కొత్తగా సమీక్ష చేసే అవకాశాన్ని కల్పించారు.ఈ సమీక్షల ఆధారంగా వాటి యొక్క రేటింగులను చూసి సాఫ్ట్ వేర్లను స్థాపించుకోవచ్చు.అంతేకాకుండా కొన్ని సాఫ్ట్ వేర్లను కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించారు.(దాదాపు ఉబుంటూలో లభించే సాఫ్ట్ వేర్ అంతా ఉచితంగానే అందించబడుతుంది)
- సరికొత్త ఫైర్ ఫాక్స్ 4 వెర్షన్.
- ఓపెన్ ఆఫీసుకు బదులుగా లిబ్రే ఆఫీసు ఉండబోతుంది (సన్ నెట్వర్కుని ఒరాకిల్ సంస్థ కనుగోలు చేసి దీనిని లిబ్రే ఆఫీసుగా మార్చడం జరిగింది.)
<a href="http://www.ubuntu.com/"><img src="http://www.ubuntu.com/countdown/banner1.png" border="0" width="180" height="150" alt="The next version of Ubuntu is coming soon"></a>
లేదా
<a href="http://www.ubuntu.com/"><img src="http://www.ubuntu.com/countdown/banner2.png" border="0" width="180" height="150" alt="The next version of Ubuntu is coming soon"></a>
లేదా
<a href="http://www.ubuntu.com/"><img src="http://www.ubuntu.com/countdown/banner3.png" border="0" width="180" height="150" alt="The next version of Ubuntu is coming soon"></a>
లేదా
<a href="http://www.ubuntu.com/testing/natty/beta"><img title="Ubuntu 11.04 days to go" src="http://picomol.de/counter/i_t.png" alt="Ubuntu 11.04 days to go" /></a>
స్థానికీకరణలోనూ మరియు ఇతర అంశాలలోనూ సహాయం, సహకారం అందించిన అర్జున రావు, కృష్ణబాబు, తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం, రవిచంద్ర, సునీల్ మోహన్ గార్లకు ప్రత్యేక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.
నెనరులు,
Praveen Illa.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి