16, నవంబర్ 2010, మంగళవారం

ఉబుంటులో మల్టిమీడియా సహకారాన్ని చేర్చండిలా...

ఉబుంటు 10.04 LTS (lucid lynx) లో mp3 లేదా DVD వీడియో ప్లే బ్యాక్ లేదా రికార్డు చెయ్యలేము, ఎందుకంటే mp3 ఫార్మట్సు పేటెంట్ హక్కులు కలిగివున్నాయి, ఆ హక్కులు కలిగివున్నవారు కావలసిన లైసెన్సులను ఏ ఇతర సంస్థలకు ఇవ్వలేదు.అందువల్ల ఉబుంటు 10.04 LTS (lucid lynx) లో మల్టిమీడియా సాఫ్ట్వేర్ను పెట్టలేదు ఎందుకంటే పేటెంట్, నకలుహక్కులు లేదా లైసెన్సు పరిమితులు వల్ల.దీని అర్ధం మీరు .mp3 దస్త్రాలను ఉబుంటు 10.04 LTS (lucid lynx)లో  ప్లే చెయ్యలేరని కాదు.కాకపోతే మీరు దీనికి ఒక చిన్న పని చెయ్యాలి అంతే...


కింద తెలిపిన సూచనలు ద్వారా మీరు .mp3 మరియు ఇతర మల్టిమీడియా సహకార దస్త్రాలను ప్లే చెయ్యవచ్చు.
ఈ సూచనలను టెర్మినల్ లో కమాండ్స్ ద్వారా చెయ్యాలి, ఈ కమాండ్స్ వాడేటప్పుడు "$ " ఈ గుర్తును మినహాయించడం (exclude) మర్చిపోకండి సుమా లేకపోతే దోషం చూపిస్తుంది.


$ sudo wget --output-document=/etc/apt/sources.list.d/medibuntu.list http://www.medibuntu.org/sources.list.d/$(lsb_release -cs).list
$ sudo apt-get --quiet update
$ sudo apt-get --yes --quiet --allow-unauthenticated install medibuntu-keyring
$ sudo apt-get --quiet update



పైన ఇచ్చిన వనరులను జోడించిన తరువాత కోడెక్ లను ఇన్స్టాల్ చెయ్యండి


ఉచితంగా లభ్యం కానీ కోడెక్ లను ఇన్స్టాల్ చేయ్యండిలా...


$ sudo apt-get install non-free-codecs


డివిడి మీడియా సహకారం ఈ కమాండ్ ద్వారా పొందండి


$ sudo apt-get install libdvdcss2


విండోస్ కోడెక్స్


$ sudo apt-get install w32codecs


వియల్సి మీడియా ప్లేయర్ ను పొందండిలా...


$ sudo apt-get install vlc mplayer

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

well, written :)...Since it is telugu linux, please do post how to install telugu langauge support in Lucid and also how to type in telugu in linux. I use maverick with telugu support. I also suggest you to include the software that directly support telugu. For eg. firefox telugu version, Open office telugu version.

Unknown చెప్పారు...

సురేష్ గారు,
పూర్తిగా ఆపరేటింగ్ సిస్టంను తెలుగులో వాడ దలుచుకున్నప్పుడు మీరు సిస్టం సంస్థాపన (installation) చేసినపుడు (choose తెలుగు సపోర్ట్ ) Live CD ఉపయోగించడం కంటే DVD వాడితే మంచిది ఇందులో ముఖ్యంగా భాషల సహకారాన్ని చేర్చుతారు. మీరు DVD ద్వారా installation చేసినపుడు వివిధ సెట్టింగ్స్ అంటే దేశము, భాష, సమయము ఎంచుకునేటప్పుడు "తెలుగు" ఎంచుకోవలసి వుంటుంది. ఈ విధంగా ఇన్స్టాల్ చేసినపుడు లాగిన్ స్క్రీన్ మీద ఏ భాషలో సిస్టంను తెరవలనుకున్తున్నారో ముందుగానే ఎంచుకోవాలి ఇక్కడ డిఫాల్ట్ గ ఇంగ్లీష్ కూడా వుంటుంది లెండి. మీరు తెలుగులో టైపు చెయ్యాలంటే IBus అనే సాఫ్ట్వేర్ ఓస్ సంస్థాపన చేసినపుడు దానితోపాటే వస్తుంది. ఈ సాఫ్ట్వేర్ ద్వారా మీరు తెలుగులో టైపు చేసుకోవచ్చు, ఇందులో మీరు వివిధ కీబోర్డ్ మోడల్స్ వుంటాయి (ఆపిల్, ఐ ట్రాన్ స్క్రిప్ట్, పోతన, ఇన్స్క్రిప్ట్, ఆర్ టి ఎస్....ఇతర భాషలవి కూడా).
త్వరలోనే ఈ విషయం మీద ఒక టపా చేస్తాను.
నా తెరచాపను ఒకసారి చూడండి.
http://d.imagehost.org/0058/1_26.jpg