గత కొద్ది కాలంగా లినక్స్ డెస్కుటాప్
పర్యావరణంలో గణనీయమైన మార్పులు చేసుకుంటున్నాయి. గ్నోమ్ 2.32 రూపాంతరం
తరువాత విడుదలైన గ్నోమ్ షెల్ కొందరికి నచ్చింది, కొందరికి నచ్చలేదు.
ఎందుకంటే సాంప్రదాయక డెస్కుటాప్ పర్యావరణం వలె కాకుండా స్మార్ట్ ఫోన్లలో
ఉపయోగించే నిర్వాహక వ్యవస్థ వలె ఉంటుంది. ఏదిఏమైనప్పటికీ ఈ మార్పులు కొత్త
తరం నిర్వాహక వ్యవస్థను రూపొందించుటకు దారితీసాయి.
గ్నోమ్
షెల్ పూర్తిగా వైవిధ్యంగా ఉంటుంది. ఇందులో మెనూలు మరియు ప్యానల్స్ వంటివి
ఉండవు. ప్రతీరోజువాడే అనువర్తనాలను సరళంగా వాడుకునే రీతిలో రూపొందించారు. గ్నోమ్ పరియోజన అభివృద్ధి కూడా చాలా వేగవంతమైనది. సృజనాత్మకతతో గ్నోమ్
షెల్‌కు మరిన్ని హంగులు దిద్దుతున్నారు. గ్నోమ్ డెస్కుటాప్ పర్యావరణాన్ని
క్రింది తెరపట్టులలో తిలకించవచ్చు.
గ్నోమ్ షెల్ కొరకు పొడిగింతల సైటును
ప్రారంభించారు. ఈ పొడిగింతలు ఫైర్‌ఫాక్స్ లోని యాడ్-ఆన్స్ వలె ఉంటాయి. ఈ
పొడిగింతలు ద్వారా మీ డెస్కుటాపుకి మరిన్ని ప్రయోజకాలను జతచేయవచ్చు.
గమనిక: ఈ పొడిగింతలు కేవలం గ్నోమ్ 3.2 లేదా ఆపై రూపాంతరాలలో మాత్రమే పనిచేస్తాయి. గ్నోమ్ షెల్ 3.0 లో పనిచేయవు.
గ్నోమ్ షెల్‌లో నాకు నచ్చిన కొన్ని పొడిగింతలు
ఈ పొడిగింతలను మీ వ్యవస్థ నందు స్థాపించుటకు https://extensions.gnome.org/ సైటుకు వెళ్ళి మీకు నచ్చిన పొడిగింతను ఎంచుకుని నొక్కినపుడు లోడైన పుటలో పైన ఎడమవైపున ఆఫ్ అనే బొత్తాం కనిపిస్తుంది
దానిపై నొక్కినట్లయితే స్థాపించమంటారా అని సంవాదం ప్రత్యక్షమవుతుంది. అపుడు install పై నొక్కండి.
స్థాపించిన పొడిగింతలను తొలగించడం ఎలా..?
మీ వ్యవస్థలో స్థాపించిన పొడిగింతలను తొలగించాలంటే స్థాపించిన పొడింత చిరునామాలో కనపడు ఆన్ బొత్తాంపై నొక్కి తొలగించవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి