29, జనవరి 2011, శనివారం

లినక్స్ లో వెబ్ క్యాం (జాలపు క్యామెరా) మృదోపకరణం

మీ అంకోపరిలో వెబ్ క్యాం ఉంది, కానీ లినక్స్ లో దానిని ఎలా వాడటం అన్నది మీ సందేహమైతే ఇక్కడ చూడండి.
లినక్స్ లో వెబ్ క్యాం కై ఎన్నో మృదోపకరణాలు ఉన్నయి, కానీ అన్నిటిలో నేను వాడి, అందరినీ వాడమని సలహా ఇచ్చే ఉపకరణం -- చీజ్.
ఇది మీరు తెలుగులినక్స్ నందు వాడుతుంటే చీజీ గా కనబడవచ్చు.
మీరు ఈ ఉపకరణాన్ని స్థాపించడానికి సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ నుండి cheese అను పదాన్ని వెతికి ఆ పదంతో ఉన్న సాఫ్ట్వేర్ను ఇంస్టాల్ చెయ్యండి.
మీరు ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ నుండి ఇంస్టాల్ చెయ్యాలనుకుంటే, చీజ్ మ్యూజిక్ అండ్ వీడియో అను విభాగంలో ఉంటుంది, ఇంస్టాల్ చేసాక. ఎంచక్కా మీరు వెబ్ క్యాం ని వాడుకోవచ్చు.
మీకు అంతేకాక రకరకాల ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి.
ఉదాహరణకి కింద గల స్క్రీంషాట్స్ చూడండి.




కొత్త రూపం, సరికొత్త సమాచారం

ఇక మీదట ఈ బ్లాగును నేనూ, ప్రవీణూ కలిసి సంయుక్తంగా నిర్వహించబోనున్నాము.
ఇక్కడ లినక్స్ కు సంబంధించినంత వరకూ మీకు పూర్తి సహాయం అందచేస్తాము.
మీకు ఎటువంటి ప్రశ్నలు, సందేహాలు ఉన్నా, ఇక్కడ వ్యాఖ్యానించండి.
నేను హైద్రాబాద్ లోనే ఉంటాను కాబట్టీ మీకు ఎటువంటి ప్రత్యక్షసహాయం కావాలన్నా శనాదివారాల్లో వచ్చి నేర్పి మరీ సరిచేస్తాను.
ఇక ఈ బ్లాగులో ముఖ్యంగా ఉబుంటూ మరియూ డెబియన్ పంపకాల గూర్చి ఎక్కువ చర్చ జరిగినా, ఆ పంపకాల ఉపయోగాలు చూపించినా, అవి అన్ని లినక్స్ పంపకాలకు వర్తిస్తాయి.
మీకు ఏవైనా అంశాలు ప్రత్యేకంగా కావాలన్నా, నాకు ఈ-మెయిల్ పెట్టండి లేదా అదీ ఇక్కడ వ్యాఖ్యానాల్లో రాయండి


అన్నట్టు ప్రవీణ్ కు తెలుపకుండానే ఈ బ్లాగు పేరు మార్చాను,
ప్రవీణ్ కు నేను క్షంతవ్యుణ్ణి


మీ భవదీయుడు,
రెహ్మానుద్దీన్ షేక్.

15, జనవరి 2011, శనివారం

మకర సంక్రాంతి శుభాకాంక్షలు



పైన వేసిన ముగ్గులో నా తోట్పాటు కూడా ఉందండోయ్, "సంక్రాంతి శుభాకాంక్షలు" అని తెలుగులో రాసింది నేనే.

12, జనవరి 2011, బుధవారం

లినక్స్ లో సీక్రెట్ మారియో క్రానికల్స్ గేమ్ ఇన్స్టాల్ చెయ్యడం ఎలా


మారియో గేమ్ అనగానే సాధారణంగా తెలియని పిల్లలు వుండరు. ఇది C ++ చే అభివృద్ధి చేయబడింది.సూపర్ మారియో బ్రోస్ ఈ ఆటకు మూలం.2008 లో  వేగంగా అభివృద్ధి చెందుతున్న  ఓపెన్ సోర్సు గేమ్ లలో ఒకటిగా నిలిచింది అంతే కాకుండా ఎటువంటి  హింసలు లేకుండా పిల్లలు ఆడుకోవటానికి రూపొందించినందుకు పలువురు ప్రసంసలు అందుకుంది.ఈ ఆటను మీరు ఉచితంగా దిగుమతి చేసుకుని స్థాపించి ఆడుకోవచ్చు.

లినక్స్ లో అన్ని ముఖ్య పంపకలలోను దీన్ని స్థాపించవచ్చు.
ఉబుంటులో ఎలా స్థాపించాలో చూద్దాం..
ఉబుంటులో  అయితే ఈ కమాండు ద్వారా స్థాపించవచ్చు.
sudo apt-get install smc
లేదా 
లేదా 
smc 
నుంచి కిందికి దించుకుని స్థాపించుకోవచ్చు.

ఓపెన్ స్యుజ్ లో అయితే
లేదా 

ఫెడోరాలో  అయితే

డెబియన్ లో అయితే

ఇతర లినక్స్ పంపకాలలో ఎలా ఇన్స్టాల్ చెయ్యాలో ఇక్కడ చూడగలరు

సీక్రెట్ మారియో క్రానికల్స్ గేమ్ తెరచాపలు కొన్ని ఇక్కడ చూడవచ్చు.