అర్జున రావు గారి కృషి/తోట్పాటు వల్ల ఇకనుంచి త్వరలోనే మనందరం డెబియన్ మరియు ఆధారిత ఆపరేటింగ్ సిస్టంల స్థాపన ప్రక్రియను తెలుగులో ప్రారంభించవచ్చు.సాధారణంగా మనం ఆపరేటింగ్ స్థాపన మొదలుపెట్టేటప్పుడు మొదటగా మనం (ఆంగ్లంలో) భాషను ఎంచుకుని ప్రారంభిస్తాము ఇదే పనిని మీరు సులభంగా ఇప్పటినుంచి తెలుగులో కూడా చెయ్యవచ్చు.డెబియన్ వారు తొందరలోనే వారి కొత్త వెర్షన్ డెబియన్ 6.0 Squeeze విడుదల చెయ్యటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ వెర్షన్ ను మీరు తెలుగులోనే స్థాపించవచ్చు.
అర్జున రావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ఈ ప్రక్రియను నేను పరీక్షించాను మీ ముందు స్థాపక ప్రక్రియ తెరచాపలను ఉంచుతున్నాను వీక్షించి మీ అభిప్రాయాలను తెలుపుతారని ఆశిస్తున్నాను. దీనిని మీరు తెలుగులినక్స్ యు ట్యూబ్ ఛానల్లో కూడా చూడవచ్చు.
4 కామెంట్లు:
ప్రవీణ్ గారు,
మీరు ఇచ్చిన సర్వేలో 'లినక్స్ మింట్' కూడా 'ఉబంటు మరియు సంబంధిత' క్రిందికే వస్తుంది.
హరి గారు,
నా ఉబుంటు సంబందిత అంటే కుబుంటు, క్సుబుంటు, ఎడుబుంటూ అనే ఉద్దేశ్యంతో పెట్టడం జరిగింది.నిజానికి లినక్స్ మింట్ ఉబుంటు సంబందిత అనడం కన్నా ఆధారిత అనడమే సబబు.
మీ వోటు జతచేసినందుకు, స్పందించినందుకు ధన్యవాదాలు.
ప్రవీణ్,
మీరు పరీక్షించి, టపా రాసినందులకు ధన్యవాదాలు. బ్లాగ్ లో అందమైన అమ్మాయిల ఫొటోలయినా ఎక్కువ పెట్టితే యిబ్బంది. డెబియన్ లినక్స్ అమ్మాయి అంత అందమైనది కాదుకాబట్టి రెండు లేక మూడు తెరపట్టులు సరిపోతాయి.
బాగా చెప్పారు, :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి