31, డిసెంబర్ 2010, శుక్రవారం

ఉబుంటు 10.04 నుంచి 10.10 కి మారడం ఎలా..?

ఉబుంటు 10.10 మేవరిక్ మీర్కట్ ఈ ఏడాది అక్టోబర్లో విడుదలైంది.ఒకవేళ మీరు కనుక ఉబుంటు 10.04 లుసిడ్ (LTS) లాంగ్ టెర్మ్ సప్పోర్ట్ లేదా దానికంటే పాత వెర్షన్ వాడుతుంటే మీరు కొత్త వెర్షన్(ఉబుంటు 10.10 మేవరిక్ మీర్కట్)కి అప్ గ్రేడ్ అవ్వానుకుంటే క్రింద తెలిపిన సూచనల ద్వారా అవ్వొచ్చు.

కీ బోర్డ్ మీద Alt+F2 మీటలను నొక్కండి.

ఆ తరువాత "Run Application" విండో ప్రత్యక్షమవుతుంది.

update-manager -d
అని టైపు చెయ్యండి. 

అప్ డేట్ మేనేజర్ విండో ఓపెన్ అవుతుంది అందులో కొత్త ఉబుంటు విడుదల లభ్యం అని కనపిస్తుంది బొమ్మలో చూపిన విధంగా...


మొదటగా ఏమైనా అప్ డేట్స్ చెయ్యవలసినవి అప్ డేట్ మేనేజర్ లో చూపిస్తే వాటిని మొదట ఇన్స్టాల్ చెయ్యండి ఆ తరువాత కొత్త వెర్షన్ కి అప్ గ్రేడ్ చెయ్యండి.

దీని సైజ్ సుమారు 1 జిబి వుంటుంది. మీది 100 kbps నెట్వర్క్ కనెక్షన్ అయితే సుమారు మూడు గంటలు పడుతుంది.


2 కామెంట్‌లు:

Apparao చెప్పారు...

sir, no need to run command for update manager.


system => admn => update manager

Unknown చెప్పారు...

~అప్పారావు శాస్త్రి గారు,

మీరన్నట్టు అప్డేట్ మేనేజర్ను నడిపినంత మాత్రాన Upgrade ఐచ్చికము చూపించదు/అలా చూపించాలని మీరు ఖచ్చితంగా చెప్పలేరు.అలా చూపించాలన్నా దానికోసం update మేనేజర్ సెట్టింగ్స్ లో show partial upgrades అనే ఒక ఐచ్చికాన్ని ఎంచుకోవలసివస్తుంది ముందుగా.
Upgrade అవ్వాలనుకున్నప్పుడు నేను టపాలో చెప్పినదే సరైన పద్ధతి.
మీ స్పందనకి
ధన్యవాదాలు.