4, మార్చి 2013, సోమవారం

యూనీకోడు పాఠ్యాన్ని అనూ పాఠ్యంగా మార్చడం ఎలా?

సత్వర అంచెలు
  1. ఈమాట గూటిలోని పరివర్తకం ద్వారా యూనీకోడు పాఠ్యాన్ని అను 6 లోకి మార్చండి.
  2. పరివర్తకం ద్వారా అను 6 నుండి అను 7లోకి మార్చండి.
  3. అను 7లోకి మారిన పాఠ్యాన్ని పేజిమేకరు 7 లోకి అతికించండి.
అంచె 1:
పలువురు కృషి ద్వారా అందుబాటులోకి వచ్చిన ఈమాట జాలగూడులోని యూనీకోడ్2ఫాంట్ పరివర్తన పుటను సందర్శించండి.


ఈ పుటలో మీరు రెండు పేటికలను గమనించవచ్చు.
ఎడమవైపు పేటికలో మీరు మార్చాలనుకుంటున్న యూనీకోడు పాఠ్యాన్ని అతికించి, కుడివైపు పేటిక పైన కనిపిస్తున్న సెలెక్ట్ అవుట్ పుట్ ఫార్మేటుపై నొక్కి అను (రంగేష్ కోన వెర్షన్)ను ఎంచుకుని క్రిందన ఇవ్వబడిన Transform బటనుపై నొక్కండి.

అంచె 2:
ఇప్పుడు పరివర్తనం చెందిన పాఠ్యాన్ని కుడివైపు పేటిక నుండి నకలుచేయండి.
ఇప్పుడు అను 7 అనువర్తనాన్ని తెరచి, క్రిందన ఇవ్వబడిన convert old text బటన్ పై నొక్కండి. ఇప్పుడు ఒక కొత్త కిటికీ తెరుచుకుంటుంది. అందులోని పై అరలో నకలుచేసిన పాఠ్యాన్ని అతికించి convert బటన్ నొక్కండి.
కొంత సమయం తరువాత తర్జుమా అయిన పాఠ్యాన్ని క్రింది అరలోనుంచి నకలు చేయండి.


అంచె 3:
అడోబ్ పేజిమేకర్ 7 తెరచి అందులో ఇంతకు ముందే నకలు చేసిన పాఠ్యాన్ని అతికించండి, వ్యవస్థ ఖతి (ఫాంటు) కోసం అడిగితే ప్రియాంక గానీ లేదా అనుపమను గానీ ఎంచుకోండి.

గమనిక: మీరు తీసుకున్న యూనీకోడు పాఠ్యంలో ఏమైనా చిహ్నాలు గానీ లేదా ఆంగ్ల అక్షరాలు గానీ ఉంటే అవి ఖతిలోని సంబంధిత తెలుగు అక్షరాలతో ప్రతిస్థాపించబడతాయి. 
అలాగే కొన్ని చోట్ల గుణింతాలు తప్పుగా పడవచ్చు.
అందువలన తర్జుమా చేసిన పాఠ్యాన్ని సరిచూసి, అవసరమైన మార్పులు చేయాల్సి ఉంటుంది.

గమనిక 2: ఈ టపా కేవలం ముద్రణకు వేరే ప్రత్యామ్నాయం లేని వారిని దృష్టిలో ఉంచుకుని చేయడం జరిగింది.
యూనీకోడులో ముద్రణకు వనరులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకూ ముద్రణను యూనీకోడులో చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము.

అడోబ్ డిజిటల్ ఎడిషన్సులో ఖతిని పెంచి చదవడం ఎలా..?

సాధారణంగా ఆడోబ్ డిజిటల్ ఎడిషన్స్ ఉపయోగించి పుస్తకాలను చదివేటప్పుడు ఫాంటు(ఖతి) చిన్నగా ఉంటే చదవడం కష్టంగా అనిపిస్తుంది. పుట రీతిని మార్చి మనకు కావలసిన పాఠ్య పరిమాణంలో తేలికగా చదువుకోవచ్చు.

అడోబ్ డిజిటల్ ఎడిషన్స్ లోని  కుడివైపు కనిపించే పుట చిహ్నం పై నొక్కండి.
ఇప్పుడు మీకు కొన్ని ఐచ్ఛికాలు కనిపిస్తాయి.
అందులో కనిపించే ఐచ్ఛికాలను ఒక్కొక్కటిగా ఎంచుకుని చూద్దాము.

1. పుటకు అమర్చు (ఫిట్ పేజ్)

2. వెడల్పుకు అమర్చు (ఫిట్ విడ్త్)
3. అసలు పరిమాణానికి అమర్చు (ఫిట్ యాక్చువల్ సైజ్)
4. అదే విధంగా రూపీకరించి (1.5 జూమ్)

5. 2x జూమ్ వద్ద
 6. 4x జూమ్ వద్ద


ఈ విధంగా వివిధ పరిమాణాలకు మార్చుకుని మనకు కావలసిన పాఠ్య స్థాయిలో పుస్తకాలను చదువుకోవచ్చు.