కొన్ని కారణాల దృష్ట్యా గత కొద్ది కాలముగా ఎటువంటి టపాలను చేయలేకపోయాను. తెలుగు లినక్స్ స్థానీకరణ, వివిధ స్వేచ్ఛాయుత సాఫ్టువేర్ స్థానికీకరణపై పూర్తి శ్రద్ధ పెట్టడం వలన గత కొద్ది నెలలుగా బ్లాగును నవీకరించడం కుదరలేదు. ఉన్నటువంటి అనువాదాలన్నిటినీ సమీక్షించి సామాన్య వాడుకరికి అర్ధమయ్యే రీతిలో ఉండాలని భావించి ఈ కార్యానికి పూనుకోవడం జరిగింది. నా మాతృ భాషకు నేను ఏదో ఒకటి చెయ్యాలనే సంకల్పమే నన్ను ఆ దిశగా నడిపించింది. నేను అనుకున్న లక్ష్యాలు దాదాపు చేరుకున్నాను వాటిలో ముఖ్యమైనవి వియల్సీ మాధ్యమ ప్రదర్శకం (VLC మీడియా ప్లేయర్), జిపార్టెడ్, షాట్వెల్, బన్షీ, ఉబుంటు అంతర్భాగ అనువర్తనాలు, లినక్స్ మింట్, గింప్, గ్నోమ్ అనువర్తనాల అనువాదం మరియు సమీక్ష, వెబ్సైటు తెలుగీకరణ, ఫెడోరా వెబ్సైటు తెలుగీకరణ, Xfce, LXDE అంతరవర్తుల అనువాదం...ఇంకా చాలా చేసాననుకోండి (చెబితే అదో పెద్ద జాబితా అవుతుంది :-)). చిన్న పిల్లల కోసం ఏదైనా ఒక లినక్స్ పంపిణీను తెలుగులోకి తీసుకురావాలనుకున్నాను. అందుకని డ్యుడ్యులినక్స్ అనే పరియోజనలో భాగస్వామినై అనువదించాను. ఇది దాదాపు 43 శాతం పూర్తయినది. కాకపోతే అంతర్జాలంలో అనువదించడం వలన కొన్ని అక్షరాలు ఎగిరిపోయినవి. అందువలన దీనిని ఇప్పటివరకూ ఎవరికీ సిఫారసు చేయలేకపోయాను. ఈ అనువాద దోషాలన్నీ ఇప్పటికే సరిచేసాను ఇక కొత్త రూపాంతరం వెలువడం ఒక్కటే ఆలస్యం.
ఇకనుండి సరికొత్త లినక్స్ సాంకేతికాలను, మెలుకువలను, చిట్కాలను మరియు జిమ్మిక్కులను వివిధ రూపాలలో అందించే ప్రయత్నం చేస్తాను.
మీరు తెలుగులినక్సును ఫేస్‌బుక్, యూట్యూబ్ లలో కూడా అనుసరించవచ్చు.
ఎప్పటివలె మీ సలహాలను, సూచనలను తెలుగులినక్సుకు అందిస్తారని ఆశిస్తున్నాను.
నిర్వాహకుడు,
Praveen Illa.
ఇకనుండి సరికొత్త లినక్స్ సాంకేతికాలను, మెలుకువలను, చిట్కాలను మరియు జిమ్మిక్కులను వివిధ రూపాలలో అందించే ప్రయత్నం చేస్తాను.
మీరు తెలుగులినక్సును ఫేస్‌బుక్, యూట్యూబ్ లలో కూడా అనుసరించవచ్చు.
ఎప్పటివలె మీ సలహాలను, సూచనలను తెలుగులినక్సుకు అందిస్తారని ఆశిస్తున్నాను.
నిర్వాహకుడు,
Praveen Illa.