22, డిసెంబర్ 2010, బుధవారం

ఉబుంటు

 
ఓపెన్ఆప్యాయత..!
అంతా ఉచితం..!’ అంటే -అటు ఎగబడే వారూ ఉన్నారు..! ఇటు పోదూ బడాయి అని నవ్వేసేవారూ ఉన్నారు! కొనలేని స్థితిలో పైరసీకి సిద్ధమే కానీ, చచ్చినా ఓపెన్ సోర్సు వొద్దు బాబోయ్ ! అనేవారు సైతం ఈ చిన్ని వ్యాసం చదవండి. విండోస్ కన్నా దీటుగా ఉబుంటు అనే లినక్స్ వెర్షన్ ఉచితంగా దొరుకుతుంది. ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్లలో ప్రస్తుతానికి రెండో స్థానంఉబుంటూదే ! రేపో, ఎల్లుండో అది ప్రథమస్థానాన్ని ఆక్రమించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రతి ఆరు నెలలకీ దీని కొత్త వెర్షన్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. ఆటోమేటిగ్గా మీ పీసీలో అప్డేట్ చేసేసుకోవచ్చు కూడా. ప్రతీ వెర్షన్ కీ 18 నెలల సపోర్టు గ్యారంటీ.‌‌‌‌

'ఉబుంటు' పేరు వినడానికే చాలా తమాషా. అటు లినక్స్ కుటుంబం ఆదరణా, ఇటు ప్రొఫెషనల్స్ తోడ్పాటూ వెరసి ఉబుంటు లినక్స్ -ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ‘సాఫ్ట్వేర్ అనేది ఉచితంగా దొరకాలి. అందరూ వారి వారి స్థానిక భాషల్లో వాడుకోగలగాలి. యూజర్లు తాము కోరుకున్న రీతిలో కస్టమైజ్ చేసుకునే వీలుండాలి’ -ఇదీ ఉబుంటు మేనిఫెస్టో. ఇది ఏదో ఆషామాషీ భారతీయ ఎలెక్షన్ మానిఫెస్టో కాదు. సాఫ్ట్వేర్ నిపుణులు చెప్పిందే చేసి చూపించే ఆపరేటింగ్ సిస్టం.
ఇంతకీఉబుంటుఅనేది జులు, హాసా భాషాలకు సంబంధించిన పదం. దక్షిణ ఆఫ్రికాలో మానవీయ సంబంధాలను వ్యక్తీకరించే ఒక భావన అది. ఒకరికొకరు, పరస్పరం చూపుకునే ఆప్యాయతకు మారుపేరుఉబుంటు’! అందుకే లినక్స్ ఆపరేటింగ్ సిస్టం ఉబుంటు వచ్చింది. ఓపెన్ సోర్స్ అంటే, అంతేకదా! ఆకాశమే హద్దు. అలాంటప్పుడు ఈ వసుధైక కుటుంబాన్ని కలిపే శక్తిఉబుంటుకే ఉందనడం అతిశయోక్తి కాదు. ఇంటెల్, ఎఎమ్డి ప్రాసెసర్ల మీదే కాదు, సన్ ఆల్ట్రా, స్పార్క్, అమెజాన్ ఇసి 2 ఆర్కిటెక్చర్లో సైతం పనిచేసేలా నేడు ఉబుంటూ దొరుకుతోంది. ప్రజాదరణతో అందరికీ చేరువవుతోంది! ఆఖరికి ఎంటర్ప్రేజ్ వెర్షన్ కూడా ఫ్రీగా లభిస్తోంది. ఇది అత్యుత్తమ ట్రాన్స్లేషన్, యాక్సెసబిలిటీ సౌకర్యాలను కలిగి ఉంది. ఉబుంటు ఇన్స్టాల్ చేసుకోవడం చాలా సులభం. అంతా 20 నిముషాల పని. ఉబుంటు 10.4 వెర్షన్ ఏప్రిల్ 2010లో అందుబాటులోకి వచ్చింది. ఉబుంటు 10.10 వెర్షన్ అక్టోబర్లో అందుబాటులోకి వచ్చింది. ఎలాంటి సాయం కావాలన్నా, ఎలాంటి డాక్యుమెంటేషన్ కావాలన్నా ఎన్నో వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి.

4 కామెంట్‌లు:

హరి చెప్పారు...

ఇది నాకు బాగా నచ్చిన OS

Rajendra Devarapalli చెప్పారు...

ముందసలు ఆ లినక్స్ నేర్చుకునే మార్గం చెప్పండి దయచేసి

వజ్రం చెప్పారు...

మరి దీనిలో /ఎంపిత్రీ ప్లేయర్‌,డివిడి ప్లేయర్ ఏమైనా ఉందా?

Unknown చెప్పారు...

@రాజేంద్ర కుమార్ దేవరపల్లి గారు లినక్స్ నేర్చుకోవాలన్న మీ ఆసక్తికి కృతజ్నతలు.
లినక్స్ కూడా మీరు వాడుతున్న విండోస్ వ్యవస్థ లాంటిదే.కాకపోతే దీనిగురించి కొంత మందికి మాత్రమే తెలుసు దీని తఢాకా..ఒకసారి వాడండి మీకు తెలుస్తుంది.
దీనిలో మీరు ప్రత్యేకంగా సాఫ్ట్వేర్లను ఎక్కడినుంచో తెచ్చుకొని లేదా వెతకవలసిన అవసరం ఉండదు, కొన్ని ముఖ్యమైన సాఫ్ట్వేర్లు మీరు లినక్స్ ఇన్స్టాల్ చేసిన వెంటనే దానితో పాటే ఇన్స్టాల్ అవుతాయి.ఇక మిగతా వాటిని "సాఫ్ట్వేర్ సొల్యుషన్ సెంటర్" ద్వారా సులువుగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు.అంతే కాదండోయ్ ఉబుంటు లినక్స్ ను తెలుగు మరియు ఆంగ్లంలో వాడవచ్చు.
దీనికి మీరు చెయ్యవలసిందల్లా ఉబుంటు లినక్స్ సిడి లేదా డివిడి ఇమేజ్ ఫైలును(.iso) డౌన్లోడ్ చేసుకుని దానిని సిడి లేదా డివిడి బర్న్/రైట్ చేసి దాని ద్వారా ఇన్స్టాల్ చేసుకోవడమే.
మీకు డౌన్లోడ్ కుదరక ఇబ్బందిగా అనిపిస్తే మీరు స్వయంగా ఉబుంటు సిడిని ఉచితంగా పొందవచ్చు.
దీనిని మీరు ఇక్కడినుండి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
http://www.ubuntu.com/desktop/get-ubuntu/download
మీరు తెలుగులో వాడదలచుకుంటే డివిడిని డౌన్లోడ్ చేసుకోండి.
ఉచితంగా పొందాలంటే నన్ను సంప్రదించండి వివరాలను తెలియజేస్తాను.
చివరిగా ఉబుంటు లినక్స్ లో ప్రత్యేకంగా ఏమి నేర్చుకోవలిసినది లేదు ఇంచుమించు విండోస్ లాగానే ఉంటుంది.

@వజ్రం గారు దీనిలో చాలా ప్లేయర్లు వున్నాయి ఉదాహరణకు VLC Media Player,Rythmbox,Movie player... మీరు బయపడవలసిన అవసరం లేదు.ఎటువంటి మీడియా ఫైలునన్నా ప్లే చెయ్యవచ్చు.

నా సిస్టం నుంచి ఒక screenshot చూడండి.
http://d.imagehost.org/0098/Screenshot.png